Telangana : తెలంగాణలో ఘోరం.. కన్న కొడుకుని కడతేర్చిన తల్లి..!
Telangana : తెలంగాణలో ఘోరం.. కన్న కొడుకుని కడతేర్చిన తల్లి..!
మన సాక్షి , నాగర్ కర్నూల్ :
తెలంగాణలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ కన్నతల్లి తన కుమారుడని కడ తేర్చిన సంఘటన బుధవారం అర్ధరాత్రి నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లో చోటుచేసుకుంది. ఎస్సై నాగ శేఖర్ రెడ్డి తెలియజేసిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ – రవీందర్ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమారులు 7, 9వ తరగతి చదువుతున్నారు. వారు వేరువేరు గ్రామాలలో హాస్టల్లో ఉంటున్నారు.
మరో చిన్న కుమారుడు హరికృష్ణ (11) గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉండగా లక్ష్మికి అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అందుకు హరికృష్ణ అడ్డుగా ఉన్నాడని ఆమె భావించి అర్ధరాత్రి భర్త రవీందర్ పొలం వద్దకు వెళ్లగా కుమారుడి తలపై కర్రతో కొట్టడంతో తీవ్ర గాయాల అక్కడక్కడ మరణించాడు.
అనంతరం కుమారుడి మృతదేహాన్ని ఇంటికి ఆవరణలో నీటి తొట్టిలో పడేసింది. నీటి తొట్టెలు మునిగి చనిపోయాడని చుట్టుపక్కల వారిని నమ్మించింది. తలపై గాయాలు రక్తస్రావం ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లక్ష్మీ అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించింది. రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ :
దేవరకొండ : మహిళ హత్య కేసును చేదించిన పోలీసులు..!
Drugs : డ్రగ్ కేసులో పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు
Crime news : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. తండ్రిని హతమార్చిన కూతురు..!









