దేవరకొండ : మహిళ హత్య కేసును చేదించిన పోలీసులు..!

నల్గొండ జిల్లా దేవరకొండలో మహిళ హత్య సంఘటన పట్ల దేవరకొండ పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని నిందితుడిని అరెస్టు చేశారు.

దేవరకొండ : మహిళ హత్య కేసును చేదించిన పోలీసులు..!

దేవరకొండ, మనసాక్షి:

నల్గొండ జిల్లా దేవరకొండలో మహిళ హత్య సంఘటన పట్ల దేవరకొండ పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండ లో బస్ డిపో పక్కన చెరుపల్లి అంతయ్య పాత భవనం పై ఒక మహిళ ను మార్చ్ 14 న ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పదునైన కత్తి తో గొంతు కోసి చంపబడినట్లు గా వచ్చి న ఫిర్యాదు మేరకు దేవరకొండ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేయనైనది.

ఇట్టి కేసు ను చాలెంజ్ గా తీసుకున్న  దేవరకొండ పోలీసులు, జిల్లా ఎస్పి చందన దీప్తి పర్యవేక్షణలో, దేవరకొండ డి.ఎస్.పి జి. గిరిబాబు ఆధ్వర్యంలో నిందితుడైన బొమ్మనబోయిన సాంబయ్య అనే వ్యక్తిని ఆధారముగా చకచక్యముగా పట్టుకొననైనది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నకు చెందిన సిద్ధనపాలెం గ్రామస్తుడు బొమ్మనబోయిన సాంబయ్య పత్తి, మిరప మరియు పొగాకు పంటలు సాగు చేస్తుండేవాడు. ఇట్టి పంటలు సాగు చేసేటనప్పుడు వ్యవసాయ కూలీలు అవసరము అవుతుంటారు. అట్టి వ్యవసాయ కూలీల కోసం కూలీలను తీసుకువెళ్ళి మూడు నెలల వరకు వారితో పని చేయించుకొని వారి లెక్క వారికి అప్పగించి పంపేవారు.

నిందితుడు మిరప పంట వేయగా, మిరపకాయ తెంపుటకు గాను కూలీలు కోసం దేవరకొండ కు వచ్చినాడు. ఆ క్రమములో దేవరకొండ ఆర్టిసి బస్ స్టాండ్ వద్ద నర్సింహా అనే వ్యక్తి పరిచయం అయి అతని ద్వారా శ్రీలత అనే ఆడమనిషి పరిచయం అయినది. శ్రీలత, నర్సింహా లు కులీ లను సమకూరుస్తామని నిందితుని తో ఒప్పందం చేసుకున్నారు.

ALSO READ : BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

అలా వారి మధ్య పరిచయం పెరిగి దేవరకొండ లో రెండు మూడు సార్లు మద్యం కూడా కలిసి తాగేవారు. అలా కులేలను మాట్లాడే క్రమములో శ్రీలత, నిందితుని వద్ద కొంత డబ్బు తీసుకున్నది. అట్టి డబ్బుల విషయంలో నిందితుడు తేదీ మార్చ్ 13 న దేవరకొండ వచ్చి సదరు శ్రీలత కు డబ్బులు అడుగగా నిందితుడికి, శ్రీలత కు మద్య గోడవ అయ్యి నిందితుణ్ణి ఏం చేసుకుంటావో చేసుకోపో అని శ్రీలత బెదిరించగా, నిండితుడు ఆమెను ఎలాగైనా చంపాలనే ఉద్దేశం తో ఆమెను మద్యం తాపించి అతని ప్లాన్ ప్రకారం దేవరకొండ లోనే కత్తి కొని అట్టి కత్తి తో శ్రీలత గొంతు కోసి ఆమె చనిపోయినదని నిర్దారించుకున్న తర్వాత అక్కడ నుండి పారిపోయినాడు.

ఇట్టి కేసు చేదించినందుకు జిల్లా ఎస్పీ చందన దీప్తి .. దేవరకొండ డి.ఎస్.పి జి. గిరి బాబు,  సీఐ ఎం. నర్సములు, దేవరకొండ, యస్ ఐలు డి . సైదులు, ఏ. రమేశ్, నందులాల్ లను, సిబ్బంది హెచ్ సీ ఈ. బాలు నాయక్, తిరుపతి, రాజారామ్, శంకర్. శ్రీభర్ రెడ్డి, హెచ్ జి ఎస్ సింహాద్రి, యాదయ్య, చంద్రమౌళి, కే. ఏడుకొండల్, సోమ్లా లను అభినందిచినారు.

RELATED NEWS : 

Drugs : డ్రగ్ కేసులో పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు

BREAKING : కోట్ల భూమిని కాజేసిన వ్యక్తులు.. అరెస్ట్, రిమాండ్..!

Miryalaguda : రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం..!

Liquor : బారీగా కర్ణాటక మద్యం పట్టివేత.. నిందితుడు అరెస్ట్..!

మిర్యాలగూడ : పోలీస్ తనిఖీలలో రూ. 5. 73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం..!

Rain : భారీ వర్షం, పిడుగుపడి ఒకరి మృతి.. మరో ముగ్గురు గాయాలయ్యాయి..!