Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

BREAKING : కోట్ల భూమిని కాజేసిన వ్యక్తులు.. అరెస్ట్, రిమాండ్..!

BREAKING : కోట్ల భూమిని కాజేసిన వ్యక్తులు.. అరెస్ట్, రిమాండ్..!

ఏసిపీ వెంకట్ రమణ గౌడ్ వెల్లడి

శంకర్‌పల్లి: (మన సాక్షి):

60 కోట్ల భూమిని కాల్ చేసిన వ్యక్తులు అరెస్ట్ అయిన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శనివారం నార్సింగి ఏసిపి వెంకటరమణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ రావు మరియు అతని స్నేహితులు కలిసి 2005 సంవత్సరంలో ప్రోగ్రెసివ్ ఆగ్రో సర్వీసెస్ అనే పేరు మీద ఒక ఫామ్ ను ఏర్పాటు చేసుకొని దాని పేరు మీద శంకర్‌పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో గల సర్వేనెంబర్ 334, 335 లోని 5 ఎకరాల 12 గుంటల భూమిని కొనుగోలు చేసినారు.

అయితే కాకినాడ, విజయవాడ మరియు మచిలీపట్నానికి చెందిన కొందరు వ్యక్తులు ఇట్టి భూమిని కాజేయాలని కుట్టపూరితంగా ఆలోచించి అట్టి భూమికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి బ్రతికి ఉన్న ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ రావు 2014లోనే చనిపోయినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికెట్ ను మరియు అతని వారసునిగా ముధాగుల వరప్రసాద్ అనే వ్యక్తి నకిలీ ఆధార్ కార్డు సృష్టించి, అట్టి భూమిని మరొక నలుగురు వ్యక్తుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినారు.

ALSO READ : BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!

అయితే ఇట్టి విషయంలో ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ రావు శంకరపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడం జరిగింది. కేసు పరిశోధనలో భాగంగా కాకినాడ మరియు విజయవాడకు పోలీసులు వెళ్లి అక్కడ గల అడ్రస్ లను మరియు ఫార్మకి సంబంధించిన వ్యక్తులను విచారించగా నేరస్తులు చేసిన మోసం బయటపడింది.

ఇట్టి కేసులో ప్రస్తుతం నలుగురు వ్యక్తులు ఏ 1- దేవగనుగల రామ వీర వెంకట వరప్రసాద్, ఏ 2 – పరశురాం పార్థసారథి, ఏ 3 – పోతునూరి త్రినాథ్, ఏ 4 – పరశురాం విజయ భార్గవన్ లను పట్టుకొని విచారించగా వారు తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ నలుగురు నిందితులను కోర్టులో హాజరు పరిచి అక్కడి నుండి రిమాండ్ కు తరలించారు.

ఈ కేసులో ఇంకా కొంతమంది వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకొని అరెస్టు చేస్తామని ఏసిపి వెల్లడించారు. కార్యక్రమంలో సిఐ హబీబుల్లాఖాన్, డిఐ నాగరాజు, ఎస్సై సంతోష్ రెడ్డి ఉన్నారు.

ALSO READ : హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు..!

మరిన్ని వార్తలు