మిర్యాలగూడ : ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

మిర్యాలగూడ : ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం ఘనంగా జరిగాయి . ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.

 

మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ మున్సిపాలిటీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు ,

 

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మగ్దుం పాష, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, డి సి సి బి డైరెక్టర్ బంటు శ్రీనివాస్, బి.ఆర్.ఎస్ నాయకులు మదర్ బాబా, పెద్ది శ్రీనివాస్ గౌడ్ ,పెండ్యాల పద్మ, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, ఇలియాస్, పునాటి లక్ష్మీనారాయణ, కర్నే గోవిందరెడ్డి, ఖాదర్, సాదినేని శ్రీనివాస్, నందకిషోర్, గొంగిడి సైదిరెడ్డి ,మెరుగు సంజయ్, సోమసుందర్,

 

బా రెడ్డి అశోక్ రెడ్డి, బోగవెల్లి వెంకటరమణ చౌదరి , షో యాబ్, డిఎస్పి వెంకటగిరి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్, మట్టపల్లి సైదయ్య ,ఏడుకొండలు, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.