Miryalaguda | దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి – ఎమ్మెల్యే భాస్కర్ రావు

దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి – ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, మన సాక్షి:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అన్నారు . మిర్యాలగూడ నియోజకవర్గం సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, R.D.O చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఎం.పి.పి లు నూకల సరళ హనుమంత్ రెడ్డి,
ధనవత్ బాలాజీ నాయక్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, Z.P.T.C సేవ్యా నాయక్, డిప్యూటీ D.M.H.O కేసా రవి, M.R.O అనిల్, M.P.D.O జ్యోతి లక్ష్మి, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచ్ లు, MPTC లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.