Telangana : తెలంగాణలో దివ్యాంగులకు పెన్షన్ పెంపు..!

Telangana : తెలంగాణలో దివ్యాంగులకు పెన్షన్ పెంపు

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టానికి కేసీఆర్ మానవీయ కోణంలో దివ్యాంగులకు పింఛన్ పెంచారు .

 

దివ్యాంగుల పింఛన్ వెయ్యి రూపాయలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వారికి ప్రతినెల 3016ల రూపాయలు పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా వెయ్యి రూపాయల పెంపుతో ఇకపై 4016 రూపాయలు పింఛన్ అందుకోబోతున్నారు.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పెన్షన్ పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే . కాగా ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది.