మల్‌రెడ్డిని కలిసిన నూతన డీసీసీ అధ్యక్షురాలు పారిజాత..!
కష్టపడి పనిచేసిన కార్యకర్త ఏ స్థాయికైనా ఎదిగే అవకాశం కాంగ్రెస్‌లో మాత్రమే ఉంటుందని, డీసీసీ ప్రెసిడెంట్‌గా పారిజాత నియామకమే ఇందుకు నిదర్శనంగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు.

మల్‌రెడ్డిని కలిసిన నూతన డీసీసీ అధ్యక్షురాలు పారిజాత..!
ఇబ్రహీంపట్నం, మన సాక్షి ప్రతినిధి :
కష్టపడి పనిచేసిన కార్యకర్త ఏ స్థాయికైనా ఎదిగే అవకాశం కాంగ్రెస్‌లో మాత్రమే ఉంటుందని, డీసీసీ ప్రెసిడెంట్‌గా పారిజాత నియామకమే ఇందుకు నిదర్శనంగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా ఇటీవల నియమితులైన చిగురింత పారిజాతా నర్సింహారెడ్డి మర్యాదపూర్వకంగా తిరుమల హిల్స్‌లోని నివాసంలో మల్‌రెడ్డిని కలిశారు.
ALSO READ : ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి..!
ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే… కొత్తబాధ్యతల్లో మంచిపేరు తెచ్చుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని మల్రెడ్డి రంగారెడ్డి సూచించారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, కాంగ్రెస్‌ను జిల్లాలో మరింత బలోపేతం చేయాలని చెప్పారు.
ALSO READ : Miryalaguda : సాగర్ ఎడమ కాలువలో గణేష్ విగ్రహాలు మునగక భక్తుల ఆగ్రహం.. స్పందించిన ప్రభుత్వం..!
కార్యకర్తలు, నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. డీసీసీ అధ్యక్షులుగా నియామకంలో సహకరించిన మల్రెడ్డి రంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన పారిజాత .నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.









