Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు
Miryalaguda : సాగర్ ఎడమ కాలువలో గణేష్ విగ్రహాలు మునగక భక్తుల ఆగ్రహం.. స్పందించిన ప్రభుత్వం..!
నాగార్జున ఎడమ కాలువ లో నిమజ్జనం చేసిన గణేష్ విగ్రహాలు మునగక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేష్ నిమజ్జనం కోసం వేములపల్లి సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద ఏర్పాటు చేశారు.

Miryalaguda : సాగర్ ఎడమ కాలువలో గణేష్ విగ్రహాలు మునగక భక్తుల ఆగ్రహం.. స్పందించిన ప్రభుత్వం..!
మన సాక్షి , మిర్యాలగూడ
నాగార్జున ఎడమ కాలువ లో నిమజ్జనం చేసిన గణేష్ విగ్రహాలు మునగక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేష్ నిమజ్జనం కోసం వేములపల్లి సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద ఏర్పాటు చేశారు. కాగా భక్తులు వినాయక విగ్రహాలను సాగర్ ఎడమ కాలువలో నిమజ్జనం చేశారు. కానీ నీళ్లు లేక గణేష్ విగ్రహాలు నీటిలో ములగడం లేదు. దాంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా గణేష్ నిమజ్జనాల కోసం ప్రభుత్వం వెంటనే స్పందించింది. కాగా నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. కాగా బుధవారం సాయంత్రం వరకు వేములపల్లి ఎడమ కాలువ లో నీరు వేములపల్లి వరకు చేరుకోనున్నాయి.









