Jurala : ఎట్టకేలకు జూరాల నీటి విడుదల..!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపిన జూరాల నీటి విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Jurala : ఎట్టకేలకు జూరాల నీటి విడుదల..!
మన సాక్షి, మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపిన జూరాల నీటి విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా జూరాల ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని రైతులు ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. జడ్చర్లలో హై టెన్షన్ వాతావరణం కూడా నెలకొన్నది. కాగా రైతుల ప్రయోజనాలను పరీక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, తాగునీటి అవసరాలకు ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో పంటలను కాపాడేందుకుగాను నీటిని విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
దాంతో బుధవారం తెల్లవారుజామున కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదలను లాంఛనంగా ప్రారంభించారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.









