జూరాల నీటిని విడుదల చేయాలి..!
జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మక్తల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జూరాల నీటిని విడుదల చేయాలి..!
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్, మనసాక్షి ;
జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మక్తల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం పంటలు పొట్ట దశకు చేరుకున్న సమయంలో సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. మక్తల్ నియోజకవర్గ రైతులు సాగునీటి కోసం జూరాల డ్యాం వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగగా, వారికి మద్దతుగా భారాస నాయకులు పాల్గొన్నారని తెలిపారు. జూరాల ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.
అమరచింత, ఆత్మకూరు, కొత్తకోట, దేవరకద్ర మండలాల పరిధిలో సాగు చేస్తున్న రైతులకు నీరు ఇవ్వకపోవడంతోపాటు కనీసం వారబందీ విధానం కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతులు పంటలు పండిస్తేనే సమాజం సుభిక్షంగా ఉంటుందని, రైతు సుభిక్షంగా ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారని అన్నారు. పంట పెట్టుబడి కోసం రైతుబంధు అందిస్తున్న ప్రభుత్వం, పంటలకు అవసరమైన సాగునీరు అందించడంపైనా దృష్టి పెట్టాలని సూచించారు.
ALSO READ : RIMS : ఆదిలాబాద్ రిమ్స్ లో అర్ధరాత్రి కలకలం.. ఎగిసి పడిన మంటలు, పసికందు మృతి..!
తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రైతులకు సాగునీరు విడుదల చేయకముందే కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయిస్తామని చెప్పడం సరికాదన్నారు.
జూరాల ప్రాజెక్టు కింద సుమారు 9 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. సాగునీరు విడుదల చేసే సమయంలో రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చి, పంటలకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని కోరారు.రైతులకు మద్దతుగా భారాస నాయకులు, కార్యకర్తలు కదిలి వస్తే అధికార పార్టీ ప్రభుత్వం ముందస్తుగా గృహ నిర్బంధాలు, అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు.
ALSO READ : Hyderabad : సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..!
ప్రభుత్వ ఆసుపత్రిపై విమర్శలు
మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కాటుకు సంబంధించిన మందులు సైతం అందుబాటులో లేకపోవడం ఆందోళనకరమని చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. దీంతో నియోజకవర్గంలో గత కొంతకాలంగా చిన్నారులు మృతి చెందుతున్నారని ఆరోపించారు. ఆసుపత్రికి 103 మందికి ఉపాధి కల్పించే విధంగా పోస్టులు తీసుకురావడంతోపాటు, భారాస ప్రభుత్వం ఉన్న సమయంలోనే ప్రభుత్వ ఆసుపత్రి మంజూరుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.









