క్రైంBreaking Newsకామారెడ్డి జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

TG : తెలంగాణలో దారుణం.. ముగ్గురు పిల్లలను చెరువులో ముంచి చంపిన తండ్రి..!

తెలంగాణ రాష్ట్రంలో దారుణమైన సంఘటన జరిగింది. ముగ్గురు ఆడబిడ్డలను ఓ తండ్రి చెరువులో ముంచి చంపారు. వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వికాస్ నగర్ లో కనిపించకుండా పోయిన ముగ్గురు అక్క చెల్లెలు దారుణ హత్యకు గురయ్యారు.

TG : తెలంగాణలో దారుణం.. ముగ్గురు పిల్లలను చెరువులో ముంచి చంపిన తండ్రి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణ రాష్ట్రంలో దారుణమైన సంఘటన జరిగింది. ముగ్గురు ఆడబిడ్డలను ఓ తండ్రి చెరువులో ముంచి చంపారు. వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వికాస్ నగర్ లో కనిపించకుండా పోయిన ముగ్గురు అక్క చెల్లెలు దారుణ హత్యకు గురయ్యారు.

ఆ ముగ్గురిని కూడా కన్నతండ్రి చెరువులో ముంచి చంపినట్లుగా తేలింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం..ణ వికాస్ నగర్ కు చెందిన ఇస్మాయిల్, షబీనా దంపతులకు షివత్ (8) హయత్ (7), మరియం (5) ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ఇస్మాయిల్ ఆటో డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే శనివారం ఉదయం 11 గంటలకు పిల్లలకు తినుబండారాలు కొనిచ్చి పంపిస్తానని ఇస్మాయిల్ తన ఆటోలో ముగ్గురిని తీసుకెళ్లాడు. ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి సబీనా ఆందోళన చెందింది. అయితే భర్తను ప్రశ్నించగా.. తాను షాప్ దగ్గర వదిలేసి కిరాయికి వెళ్లాలని చెప్పాడు.

ALSO READ : TG : రైతులకు భారీ శుభవార్త.. ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాలలో జమ..!

కాగా పిల్లలు ముగ్గురు ఎటో వెళ్లారని చుట్టుపక్కల వెతికారు. ఇస్మాయిల్ కూడా తన భార్యతో పాటు వెతికాడు. చివరికి చిన్నారులు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా ఇస్మాయిల్ తన ఆటోలో చెరువు వైపు తీసుకెళ్లినట్లుగా తేలింది. ఇస్మాయిల్ ను పోలీసులు అదుపులో తీసుకొని విచారించగా..

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి చంపినట్లుగా ఒప్పుకున్నాడు. దాంతో పోలీసులు చెరువు వద్దకు వెళ్లి గజఈత గాళ్ల సహాయంతో గాలించగా శనివారం రాత్రి 11 గంటలకు మృతదేహాలు లభించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇస్మాయిల్ ను అదుపులోకి తీసుకున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు