TOP STORIESBreaking Newsతెలంగాణసంక్షేమం

TG : తెలంగాణలో పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2500 ఎప్పటినుంచంటే..!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ గృహాలు అర్హులైన వారికి అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పెంపు చేపట్టారు.

TG : తెలంగాణలో పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2500 ఎప్పటినుంచంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ గృహాలు అర్హులైన వారికి అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పెంపు చేపట్టారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను ముఖ్యమైనవి ఆసరా పింఛన్ల పెంపు, ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు అందజేస్తామని ప్రకటించడం. అయితే ఇప్పటివరకు అవి అమలుకు నోచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆసరా పింఛన్లు వృద్ధులకు నెలకు 2016 రూపాయలను అందించేవారు, కాగా వికలాంగులకు 4016 రూపాయలను అందించేవారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులకు ఇతరులకు నెలకు 4016 రూపాయలు ఇస్తామని, వికలాంగులకు 6016 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కాగా మహిళలకు నెలకు 2500 రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆ హామీల గురించి పట్టింపు లేదు. కానీ మార్చి నెలలో నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో పింఛన్ల పెంపు, మహిళలకు 2500 రూపాయల ప్రకటన ఉంటుందని లీకులు రావడంతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అవి ఏ మేరకు నిజం అవుతాయో చూడాలి. బడ్జెట్ లో వాటికి నిధులు కేటాయిస్తారా..? ఆ పథకాలు అమలుకు తేదీలను ప్రకటిస్తారా..? అనే విషయం తెలియాల్సి ఉంది.

ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకముకే యాసంగి విడతగా 9000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మూడు నెలలుగా ఎదురుచూస్తున్న రైతులకు ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుంది. దాంతోపాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కూడా ఊసే లేదు. కొత్తగా మరో రెండు పథకాలను ఎలా అమలు చేస్తారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం వీటికి ఏ మేరకు కేటాయిస్తారు. అనే విషయం తేటతెల్లం కానున్నది.

MOST READ 

మరిన్ని వార్తలు