Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

TG News : ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నోటీసులు..!

తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు ఇంకా కొనసాగుతుంది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

TG News : ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నోటీసులు..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు ఇంకా కొనసాగుతుంది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పటివరకు ఏడు మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ చేయాల్సి ఉంది. కాగా ఈ క్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం నోటీసులు ఇచ్చారు. ఈనెల 30వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

అదేవిధంగా దానం నాగేందర్ పై అనర్హత పిటీషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి సైతం స్పీకర్ నోటీసులు జారీ చేశారు. 30వ తేదీన వారు కూడా విచారణకు రావాలని పేర్కొన్నారు.

MOST READ 

  1. BREAKING NEWS : బారామతిలో ఘోర విమాన ప్రమాదం.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సహా ఆరుగురు దర్మరణం..!

  2. Nalgonda : రూ.30 లక్షల వ్యయంతో హెల్త్ ఎటిఎం.. ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి..!

  3. Miryalaguda : మిర్యాలగూడలో అన్నపూర్ణ అభయ హస్తం.. రూ.5 భోజనం ఏర్పాటు..!

  4. Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!

మరిన్ని వార్తలు