Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESతెలంగాణ

TG News : కొత్త సర్పంచుల ఉత్సాహం.. పల్లెల్లో అభివృద్ధికి బాటలు, కానీ అప్పుడే ఎదురుచూపులు..! 

రెండేళ్లుగా పాలకవర్గం లేక ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. ప్రభుత్వాలు పంచాయతీలకు నిధుల విడుదల కాక ఖాతాలు ఖాళీగా మారాయి. పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చు చేసి పంచాయతీలను నడిపించారు.

TG News : కొత్త సర్పంచుల ఉత్సాహం.. పల్లెల్లో అభివృద్ధికి బాటలు, కానీ అప్పుడే ఎదురుచూపులు..! 

పెన్ పహాడ్, మన సాక్షి :

రెండేళ్లుగా పాలకవర్గం లేక ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. ప్రభుత్వాలు పంచాయతీలకు నిధుల విడుదల కాక ఖాతాలు ఖాళీగా మారాయి. పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చు చేసి పంచాయతీలను నడిపించారు. ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నిక లు పూర్తికాగా. పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు సమస్యలపై దృష్టి సారించారు. ఉత్సాహంగా పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు.

అయితే ఖాళీ ఖాతాలు వారి అడుగులకు సంకెళ్లు వేస్తున్నాయి. ప్రస్తుతానికి సొంత డబ్బులు ఖర్చు చేస్తూ చిన్నచిన్న హామీలు నెరవేరుస్తున్నారు. పాలన గాడిలో పెట్టేలా. గత నెల లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. నూతనంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు బాధ్యతలు చేపట్టినారు. పాత సర్పంచులది రెండేళ్ల క్రితం సర్పంచుల పదవీకాలం ముగియగా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకుండా ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేక అధికారులు పాలనను గాలికొదిలేసి సమస్యలు పట్టించుకోవడం లేదు.

ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. కొంతవరకు పనులు కార్మికులతో పారిశుద్ధ్యం పనులు మినహా ఇతర పనులు ముందుకు సాగలేదు. అంతర్గత రోడ్ల ప్రధాన రహదారులకు మరమ్మతులు లేక అడుగడుగున గుంతల మయంగా మారాయి. తాగునీటి సరఫరాను సక్రమంగా చేపట్టేందుకు పైపులైన్ల మరమతులు గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు. ఇతర పనులు కూడా అంతంత మాత్రంగానే లోగా జరిగాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కార్యదర్శులు సొంత డబ్బులతో లక్షలలో ఖర్చు చేసి సమస్యలు పరిష్కరించారు.

ఖాతాల్లో నిధులు లేకపోవడంతో వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. ఎట్టకేలకు నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టి పల్లె పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాలలో ఒక్కొక్కటిగా పరిష్కరించేలా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ఖర్చు తడిసి మోపెడు కాగా అప్పులు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తంటాలు పడుతున్నారు. పంచాయతీలకు ఎస్ డి ఎఫ్ నిధులు ప్రభుత్వం మంజూరు చేయనున్నది గ్రామాల్లో ఎన్నికల సందడి పూర్తి కావడంతో పంచాయితీల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

నిధుల కొరతను తీర్చేందుకు పంచాయతీలకు ఎస్ డి ఎఫ్ నిధులు మంజూరు చేయనున్నట్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో కొత్తగా పాలన పగ్గాలు చేపట్టిన సర్పంచులకు ఆదిలోనే తీపి కబురు అందింది. రాష్ట్రం నుంచి నిధులు మంజూరు అయితే అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు వీలవుతుంది. మేజర్ గ్రామాలకు 10 లక్షలు చిన్న గ్రామాలకు 5 లక్షల చొప్పున జనవరిలో అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గ్రామాలకు మళ్లీ పాత రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. పాలకవర్గాలు కొలువుదీరడంతో కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల సైతం మంజూరయ్యే అవకాశం ఉంది.

వీటితోపాటు సాధారణ. ఉపాధి హామీ. పంచాయతీ పరిధిలో పన్నుల వసులు ద్వారా ఆదాయం సమకూర్చనుంది. కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ పరిధిలోని జనాభా ఆధారంగా వ్యక్తికి ఏడాదికి 618 రూపాయల చొప్పున నిధులు విడుదల చేస్తుంది. గతంలో కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి అందించేది. అక్కడి నుండి పంచాయతీలకు చేరేవి. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వమే నేరుగా పంచాయతీలకు నిధులను విడుదల చేస్తుంది. రెండేళ్ల కాలానికి సంబంధించి పెండింగ్ నిధులు మొత్తం పంచాయితీలకు అందనున్నాయి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా సర్పంచ్ ఉపసర్పంచులకు చెక్కు పవర్ అధికారం ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శులు బ్యాంకులు ట్రెజరీలతో కొత్త సర్పంచులు ఉప సర్పంచ్ మార్చే పనుల్లో నిమగ్నమైనారు.

By : NageshwarRao, 96403 45354

MOST READ 

  1. కోడి పందేలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!

  2. Suryapet : మంచినీళ్లు రాక రెండు నెలలు.. ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ వద్ద మహిళల నిరసన..!

  3.  Narayanpet-Kodangal lift Irrigation : నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం పై ముగిసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ..!

  4. Narayanpet : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి పత్రికలు.. మన సాక్షి క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ..!

మరిన్ని వార్తలు