క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : ఏడాదికాలంగా ఆ ముఠా అదే పని.. పోలీసులకు చిక్కారు..!

Nalgonda : ఏడాదికాలంగా ఆ ముఠా అదే పని.. పోలీసులకు చిక్కారు..!

గుర్రంపోడు, మనసాక్షి :

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల చామలేడు గ్రామానికి చెందిన గుండెబోయిన యాదయ్య మార్చి 10వ తారీఖు 5 హెచ్ పి కరెంటు బోర్డర్ 20 వేల రూపాయల గల మోటారును వ్యవసాయ భూమి పక్కన ఉన్న ఎస్ఎల్బీసీ కాలువ నుండి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని అనే ఫిర్యాదు పై గుర్రంపూడ్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడమైనది.

కేసు వివరాల్లో భాగంగా గుర్రంపూడ్ ఎస్సై మధు గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఆరెగూడెం బస్సు స్టేజి వద్ద వాహన తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు హీరో హోండా ప్యాషన్ బైక్ పై కరెంటు తీగలను తీసుకొని అనుమానస్పదంగా వెళ్తుండగా వారిని పట్టుకుని నేరస్థులను విచారించగా వారు గత సంవత్సర నుండి చామలేడు గుర్రంపొడు గ్రామ శివారులో ఉన్న ఎస్ ఎల్ బి సి కాలువలో రైతులు యొక్క కరెంటు మోటారును కరెంటు తీగలను దొంగతనాలను ఒప్పుకున్నారు.

జల్సా లకు అలవాటు పడి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో దొంగతనాలు చేస్తున్నట్టు. వారి దగ్గర నుంచి నాలుగు కరెంటు మోటార్లను 80 మీటర్ల కరెంటు తీగలను దొంగతనం చేసి దాచిన దోటి సైదులు, దోటి శంకర్, దోటి అశోకుని విచారించగా దోటి సైదులు యొక్క వ్యవసాయ భూమి వద్ద రికవరీ చేయడం జరిగింది .

హీరో హోండా ఫ్యాషన్ బైకు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రికవరీ చేసిన సొత్తు 94,800 గల విలువ కలిగి ఉంటుంది. ముగ్గురు వ్యక్తులను రిమాండ్ చేసి జైలుకు తరలించడం జరిగింది. దొంగతనాలను ఛేదించడంలో పనిచేసిన సిబ్బంది అయినటువంటి ఎస్ఐ మధును, కావలి నరసింహ, నాగరాజు, సైదులు, లను దేవరకొండ ఏ ఎస్ పి మౌనిక అభినందించారు.

MOST READ : 

  1. Suryapet : బీఆర్ఎస్ ఫినిక్స్ పక్షి అంట.. మరి రేవంత్ రెడ్డి జాక్‌పాట్ అంట.. కేటీఆర్ సారూ ఇలా అనబట్టే..!

  2. Suryapet : సర్పంచ్ హత్య కేసు పై మల్టీ జోన్ 2 ఐజిపి సత్యనారాయణ విచారణ..!

  3. TG News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త..! 

  4. Telangana Budget 2025 : తెలంగాణ బడ్జెట్ లో సామాన్యులకు భారీ గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు