District collector : వంటగది శుభ్రంగా, భోజనం నాణ్యత ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District collector : వంటగది శుభ్రంగా, భోజనం నాణ్యత ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
కనగల్, మన సాక్షి :
విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా, కనగల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినిలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, వారికి నోట్ పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థినులతో మాట్లాడుతూ బాగా చదువుకోవాలని, జీవితంలో ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని చెప్పారు. కేజీబీవీ పాఠశాలతో పాటు, పరిసరాలను, వంటగది అన్నింటిని శుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా భోజనం నాణ్యతగా ఉండాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.
మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, గుణాత్మక విద్యను బోధించాలని కలెక్టర్ సూచించారు. కాగా కేజీబీవీలో సుమారు 230 మంది విద్యార్థినులు ఉండగా, తరగతి గదుల కొరత ఉందని, గతంలో పాఠశాల సందర్శన సందర్భంగా గమనించిన జిల్లా కలెక్టర్ అదనపు తరగతి గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పడమే కాకుండా, అదనపు తరగతి గదులను మంజూరు చేయించినట్లు తెలిపారు.
త్వరలోనే ఆదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామన్నారు. జిల్లా కలెక్టర్ వెంట తహసిల్దార్ పద్మ , ఎంపీఓ సుమలత, ఎంఈఓ పద్మ తదితరులు ఉన్నారు.
MOST READ :









