సింగూరు ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. ఇక రెండు పంటలకు డోకా లేదు..!
సింగూరు ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. ఇక రెండు పంటలకు డోకా లేదు..!
అందోలు, మనసాక్షి :
వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో సింగూర్ నీటితో వ్యవసాయ సాగుకు డోకా లేదని, రెండు పంటలకు సాగు నీరు అం దించవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సీ.దామోదర్ రాజనర్సింహా అన్నారు.
సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి నీటిమట్టం చేరుకోవడంతో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తో కలిసి ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు.
ప్రాజెక్టుకు వస్తున్న వరద పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సింగూరు జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుండడంతో ప్రాజెక్టు 4,6 నంబర్ల రెండు గేట్లను 1.50 మీటర్ల పైకెత్తి 16284 క్యూసెక్కుల నీటిని
దిగువకు వదిలారు.
ప్రస్తుతం ప్రాజెక్టులో 28.555 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో జెన్ కో ద్వారా 2822 క్యూసెక్కులు, రెండు గేట్ల ద్వారా 16284 క్యూసెక్కుల నీటిని మొత్తం 19106 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ సింగూర్ ప్రాజెక్టు నిండు కోవడం వలన ఆయకట్టు రైతంగానికి ఈ యేడు రెండు పంటల సాగుకు ఢోకా ఉండదని అన్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టని చేరుకొని జలకళ
సంతరించుకోవడం సంతోషకరమన్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుండి భారీగా వరదనీరు వస్తుండడంతో దిగువకు నీరు వదిలామన్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సింగూరు నిండుకుండల మారడంతో ఈ ప్రాంతమంతా సాగునీటితో సస్యశ్యామలం కానుందన్నారు.
టూరిజం ప్లాంట్ గా తీర్చిదిద్దుతా :
సింగూరు ప్రాజెక్టు సమీపంలోని టూరిజం పార్కును మంత్రి దామోదర్ సందర్శించారు. పార్కు అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.పార్కులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మంత్రి హామీనిచ్చారు.
అనంతరం బస్వాపూర్ మోడల్ స్కూల్లో సందర్శించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు,విద్యార్థులతో కలిసి గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనని ఆయన అన్నారు.
నిర్మాణంలో ఉన్న మోడల్ స్కూల్ వసతి గృహాన్ని మంత్రి పరిశీలించారు . పనులు వేగంగా పూర్తి కావడం లేదని కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి మంత్రి దృష్టికి తెచ్చారు. నూతన వసతి గృహంలో అసంపూర్తిగా ఉన్న పనులు నాణ్యత పాటించి వేగవంతంగా, పూర్తి చేయాలని అధికారులను మంత్రివర్యులు ఆదేశించారు.
అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు భాగా చదువుకొని విద్యావంతులుగా ఎదగాలని, జిల్లా కలెక్టర్ ను ఆదర్శంగా తీసుకోని చదవాలన్నారు. కలలు కనండి సాకారం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ భాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి నీ కాళ్ళ మీద నీవు నిలబడినప్పుడే సమాజంలో గుర్తింపు ఉంటుందని మా అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను కలెక్టర్ అయ్యానని, మీరు కూడా మీ గురువులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని మంచిగా చదుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు కె. ధర్మ, సి,ఈ, భీమ్ ఇఇ, నాగరాజు డీఈఈ , ఆర్ డి ఓ పాండు,స్థానిక ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.
LATEST UPDATE :
BREAKING : మన్యంలో మోగిన తుపాకీ తూటాలు.. ఆరుగురు మావోయిస్టులు మృతి..!
మెదక్ జిల్లాలో దారుణం.. దిష్టి తీసిన వస్తువులు రోడ్డుమీద వేశారని, ఊరు నుంచే..!
Holidays : ఈ నెలలో ఆ రెండు రోజులు సెలవులు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!









