దసరా సెలవుల డేట్స్ ఇవే.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!
దసరా సెలవుల డేట్స్ ఇవే.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులను ప్రకటించింది. విద్యార్థులకు సెలవులు కలిసి రావడంతో ఎగిరి గంతేసే వార్తను తెలియజేసింది. దసరా పండుగకు వరుసగా 13 రోజులు సెలవులు రానున్నాయి.
అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. తిరిగి పాఠశాలలు 15వ తేదీన పున ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3వ తేదీన బతుకమ్మ పండుగ ఉన్నప్పటికీ అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి ఉన్నందున 2వ తేదీ నుంచే సెలవులను ప్రకటించింది.
అంతేకాకుండా కొన్ని ప్రైవేటు పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచే సెలవులు ప్రకటించాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రకటించినట్టు కొన్ని ప్రైవేటు పాఠశాలలు హాస్టల్లో ఉన్న తమ విద్యార్థులను తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రభుత్వం 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వరుసగా 13 రోజులపాటు దసరా సెలవులను ప్రకటించింది.
LATEST UPDATE :
BIG BREAKING : తప్పిపోయిన గురుకుల విద్యార్థుల ఆచూకీ లభ్యం..!
Miryalaguda : మిర్యాలగూడలో నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణం.. రేపు మంత్రులచే భూమి పూజ..!









