క్రైంBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి

జల్సాలకు అలవాటు పడ్డారు.. కట్ చేస్తే జైలుకు..!

జల్సాలకు అలవాటు పడ్డారు.. కట్ చేస్తే జైలుకు..!

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

ఇంటి ముందు ఉన్న బైక్ లను దొంగిలిస్తున్న ఇద్దరు దొంగలను షాద్ నగర్ పోలిసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పట్టణ సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం షాద్ నగర్ పట్టణంలోని హాజీపల్లి రోడ్ లోని ఎన్జీవో కాలనీకి చెందిన మూడావత్ కమల్య నాయక్ తన ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ కనిపించడం లేదని ఈ నెల 18న పోలిసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసిన పోలిసులు అన్ని రకాలుగా విచారణ చేయగా పట్టణంలోని గాంధీ నగర్ కాలనీకి చెందిన సూరమోని శ్రీశైలం, లింగారెడ్డి గుడ గ్రామానికి చెందిన బీశ్వ రాజులు కలసి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్నట్లు గుర్తించి చాకచక్యంగా పట్టుకున్నారు.

దొంగలను విచారించిన పోలిసులు వారి నుండి దొంగిలించిన ఆరు ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. నిందితులు దుకాణాల ఎదురుగా, ఇంటి ముందు నిలిపిన వాహనాలను టార్గెట్ గా చేసుకుని నకిలీ తాళంచెవిల సహాయంతో తాళం తీస్తారని, అలా కుదరక పొతే హ్యాండిల్ ను విరగొట్టి బైక్ లను దొంగిలించుకు పోయి వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం అలవాటుగా చేసుకున్నారని తెలిపారు.

ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్ట్ లో హాజరు పరచినట్లు తెలిపారు. కేసు చెదనలో చాకచక్యంగా వ్యవహరించిన షాద్ నగర్ ఎస్ఐ శరత్ కుమార్, కానిస్టేబుల్ సిబ్బంది కృష్ణ, శంకరయ్య, మహేశ్, రాజేశ్, రఫీ లను అభినందించారు. వారికి తగిన రివార్డ్ లను పై అదికారుల ద్వారా ఇప్పించనున్నట్లు తెలిపారు.

LATEST UPDATE : 

BIG BREAKING : ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు..!

Rythu Barosa, Runmafi : రైతు భరోసా, పంటల రుణమాఫీ యాప్ తో సమస్యలకు చెక్.. రేపటి నుంచి ఇంటింటికి సర్వే..!

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

HYDRA : హైడ్రా దూకుడు.. నెక్స్ట్ అనురాగ్..?

మరిన్ని వార్తలు