Miryalaguda : మిర్యాలగూడలో సన్న బియ్యం పండుగ..!
Miryalaguda : మిర్యాలగూడలో సన్న బియ్యం పండుగ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం సన్నబియ్యం పండుగ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకం విజయవంతమైంది. ఈ పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఉచితంగా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేసింది. దాంతో లబ్ధిదారుల నివాసాల్లో గురువారం పండుగ నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణంలోని అన్ని వార్డులలో సన్నబియ్యం లబ్ధిదారుల ఇళ్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు భోజనాలు చేసి పండుగ నిర్వహించారు.
పట్టణంలోని సుందర్ నగర్ కు చెందిన సన్నబియ్యం లబ్ధిదారులు ఆటో నాగయ్య తో పాటు పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సన్న బియ్యం లబ్ధిదారుల నివాసాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, భోజనాలు చేశారు. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డిఎస్పి రాజశేఖర్ రాజు, తాసిల్దార్ హరిబాబు పాల్గొని భోజనాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వల్ల పేదలు తినలేకపోయారని, తమ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడంతో కడుపునిండా తింటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలు అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్నారని అన్నారు.
MOST READ :
-
Miryalaguda : మిర్యాలగూడలో పేదల ఇళ్లలో సన్న బియ్యం పండుగ..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై శుభవార్త.. ఈ పథకానికి మరిన్ని నిధులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Miryalaguda : మీ ధాన్యం కు మద్దతు ధర రాలేదా.. సబ్ కలెక్టర్ ప్రత్యేక చర్యలు..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. ఐతే వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్..!
-
Suspended : పంచాయతీ కార్యదర్శి సస్పెండ్.. ఎక్కడో తెలుసా..!










