Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. అర్ధరాత్రి సంచరిస్తూ..!
Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. అర్ధరాత్రి సంచరిస్తూ..!
నల్లగొండ, మన సాక్షి.
అర్ధ రాత్రి ఆవారాగా తిరుగుతూ, వంటరి వ్యక్తులే టార్గెట్ గా వారిపై దాడి చేసి దారి దోపిడీకి పాల్పడుతున్న నలుగురు నిందితుల ముఠాను అరెస్టు చేసిన నల్లగొండ 2 టౌన్ సీఐ యస్.రాఘవరావు తెలిపారు. వీరి వద్ధ నుండి 600 రూపాయల నగదు,(2) మోటార్ సైకిళ్ళు (02) సెల్ ఫోన్లు స్వాధీనము చేసుకున్నట్టు తెలిపారు.
నేరస్థుల వివరాలు
తుడుము ధనుంజయ్ కనకదుర్గ స్ట్రీట్, రామగిరి, నల్లవొండ,
మునగ వంశీ గాంధీనగర్, నల్లగొండ
మునగ వంశీ మల్లారము గ్రామము, కట్టంగూరు మండలము, నల్లగొండ జిల్లా
గజ్జి సాయి గాంధీనగర్, నల్లగొండ.
నేరస్థులు నేరం చేయు విధానం :
వీరు మధ్యము త్రాగుడుకు మరియు గంజాయికి అలవాటు పడటము వలన వారికి ఏ పని చేతకాక వారి యొక్క త్రాగుడుకు గంజాయికి డబ్బులు లేక పోవడము వలన వారు ఎవరైనా ఒంటరిగా ఉన్నవారిని చూసి వారిని కొట్టి డబ్బులు గుంజు కోవాలని పధకము వేసుకుని ఈనెల 20న మద్య రాత్రి వారు రెండు మోటార్ సైకిల్ల మీధ సావర్కర్ నగర్ లో యున్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపములో అటూ ఇటూ తిరుగుచుండగా మధ్య రాత్రి 01.30 గంటల సమయములో పిర్యాధి అయిన వడ్నాల సాయి కిరణ్ సావర్కర్ నగర్ నుండి రైల్వే స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్ళు చుండగా నేరస్థులు మోటార్ సైకిళ్ళ మీధ వెళ్ళి అట్టి వ్యక్తిని అడ్డగించి అతన్ని చేతులతో కొట్టి అతని వద్ధ యున్న 1400/- నగదు, అతని సెల్ ఫోను గుంజుకుని అట్టి వ్యక్తిని చంపుతామని బెదిరించి అతని ఫోన్-పే పాస్ వర్డ్ తెలుసుకుని అక్కడి?నుండి వెళ్ళి అట్టి గుంజుకున్న నగధులో రూపాయలు 800/- వారి త్రాగుడుకు ఖర్చు పెట్టుకున్నారు.
గతములో నేరస్థులు తుడుము ధనుంజయ్, గజ్జి సాయి శ్రీకాంత్ లు ఇద్దరు 2024 సంవత్సరములో హైదరాబాద్ లోని ఎల్బినగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్ళినారు. బుధవారం ఉదయం 06.00 గంటలకు నల్లగొండ టూ టౌన్ సిఐ .రాఘవ రావు కి వచ్చిన సమాచారము మేరకు నేరస్థులు తుడుము ధనుంజయ్ ని నల్ల్గొండ లో అరెస్టు చేసి నేరము చేయుటకు వాడిన బజాజ్ ప్లాటినం మోటార్ సైకిల్ యమాహా మోటార్ సైకిల్ (2) సెల్ ఫోన్లు మరియు 600/- లు నగధు స్వాధీనము చేసుకోనీ రిమాండ్ కు తరలించనైనదని తెలిపారు.
ఇట్టి కేసును నల్గొండ డి.ఎస్.పి శివరాం పర్యవేక్షణలో నల్లగొండ టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్రాఘవ రావు టూ టౌన్ యస్.ఐ .సైదులు సిబ్బంధి సాగర్ల శంకర్, లావూరి బాలకోటి లను జిల్లా ఎస్పీ అభినందించారన్నారు.
MOST READ :
-
TG News : బెట్టింగ్ యాప్ కేసులో కీలక మలుపు.. సర్కార్ కీలక నిర్ణయం..!
-
Mahila : మహిళా రైతులకు 50% రాయితీ పై వ్యవసాయ పనిముట్లు..!
-
Gold Price : వరుసగా పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!
-
Summer Tours : టూర్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ బడ్జెట్, టాప్ 10 సమ్మర్ టూరిస్ట్ ప్లేసేస్..!
-
Aeroplane: విమానంలో తీసుకెళ్లే నగదుకి పరిమితులున్నాయా.. ఏవి తీసుకెళ్లొద్దో తెలుసుకుందాం..!









