NALGONDA : మా ప్రభుత్వానికి ఇదే నిదర్శనం.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..!
NALGONDA : మా ప్రభుత్వానికి ఇదే నిదర్శనం.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..!
వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యత, బడ్జెట్లో 72,659 కోట్ల కేటాయింపు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ మన సాక్షి :
తమది రైతు ప్రభుత్వం అనడానికి నిదర్శనంరాష్ట్ర బడ్జెట్లో 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించడమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం నలగొండలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీకి 31 వేల కోట్ల రూపాయలు కేటాయింపు దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల పూర్తికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు ఎస్ఎల్బీసీ సొరంగం , శివన్న గూడెం, బ్రాహ్మణ వెల్లేముల, పాలమూరు- రంగారెడ్డి ,సీతారామ వంటి ప్రాజెక్టుల పూర్తికి ఎక్కువ నిధులు కేటాయింపు చేసి తమప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధికి 29 వేల కోట్ల రూపాయలు, ఆర్ అండ్ బి కి 7315 కోట్ల రూపాయల కేటాయింపు జరిగిందని కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపించింది అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 75577 కోట్ల రూపాయల మిగులు ఉండేది, డిసెంబర్ 3, 2023 న 6,71357కోట్ల రూపాయలతో అప్పుల రాష్ట్రంగా గత ప్రభుత్వం అప్పగించిందని 37 వేల కోట్ల రూపాయలు ఇందిరమ్మ 6 గ్యారంటీలకు అమలు చేయడం, ఒకటో తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు ఇస్తూన్నాం అన్నారు.
ALSO READ : ఆగస్టులోనే పంచాయతీ ఎన్నికలు..?
గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీ కలిపి 42 వేల కోట్లు చెల్లించాము అని, రైతులకు ఇచ్చే 12 వేల రూపాయలను త్వరలోనే అమలు చేస్తాం అని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం వ్యవసాయానికి ఎన్నడూ 72,000 కోట్లు రూపాయలు కేటాయించలేదు అని, దేశ చరిత్రలోనే వ్యవసాయానికి సుమారు లక్ష కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్రం ఏది లేదు అన్నారు. పది రోజుల్లో బ్రాహ్మణ వెల్లేముల ట్రయల్ రన్ నిర్వహిస్తాం అన్నార.
డిసెంబర్లో కాలువలను పూర్తి చేస్తాం అని తెలిపారు. ఎస్ఎల్ బిసీ సొరంగం పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అమెరికా నుండి కొత్త మిషన్ను తెప్పించనున్న లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తాం అని అన్నారు.
నల్గొండ లోని ప్రాజెక్టులతో పాటు, పాలమూరు- రంగారెడ్డి పనులను పూర్తి చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యం అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 80 కోట్ల రూపాయలతో 20 ఎకరాలలో సమీకృత వసతి గృహాల నిర్మాణం చేపడుతున్నాం అని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి రెండు నెలల్లో టెండర్లు పిలువనున్నాం అని తెలిపారు. 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఐబీఎం తరహాలో దీనిని ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. మీడియా సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ,పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ALSO READ :
NALGONDA : డిజిటల్ బోధన తీరుపై జిల్లా కలెక్టర్ పరిశీలన.. విద్యార్థులతో ముఖాముఖి..!









