Dubbaka : డబుల్ బెడ్ రూం ఇంట్లో చోరీ..!

పట్టణంలోని డబుల్ సముదాయంలో తోట్ల రేణుక అనే గృహిణి, తన భర్త, కూతురుతో కలిసి వారికి వచ్చిన డబుల్ ఇంటిలో నివాసం ఉంటున్న ఇంట్లో గుర్తుతెలియని దొంగలు వెండితోపాటు, నగదును అపహరించిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.

Dubbaka : డబుల్ బెడ్ రూం ఇంట్లో చోరీ..!

నగదు, వెండి అపహరణ

దుబ్బాక, మనసాక్షి :

పట్టణంలోని డబుల్ సముదాయంలో తోట్ల రేణుక అనే గృహిణి, తన భర్త, కూతురుతో కలిసి వారికి వచ్చిన డబుల్ ఇంటిలో నివాసం ఉంటున్న ఇంట్లో గుర్తుతెలియని దొంగలు వెండితోపాటు, నగదును అపహరించిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. దుబ్బాక ఎస్సై గంగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో ఉంటున్న తోట్ల రేణుక అనే మహిళ రోజువారి నిమిత్తం పని మంగళవారం కుటుంబ సభ్యులు అందరూ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి, రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఉండడంతో, లోనికి వెళ్లి చూడగా బీరువా పక్కనే ఉన్న సంచిలో ఉన్న అరతులం బంగారం, 20 తులాల వెండి, 38 వేల రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఆధారాలను సేకరించి. రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ALSO READ : Telangana : తెలంగాణలో ఘోరం.. కన్న కొడుకుని కడతేర్చిన తల్లి..!