నేడు దమ్మపేటలో కోర్టు ప్రారంభోత్సవానికి అన్నీ సిద్ధం

నేడు దమ్మపేటలో కోర్టు ప్రారంభోత్సవానికి అన్నీ సిద్ధం

దమ్మపేట, మన సాక్షి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో శనివారం జూనియర్ సివిల్, జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు ప్రారంభం కానుంది. దమ్మపేట మండల కేంద్రంలోని మల్లారం గ్రామ శివారులో ఎస్టీ హాస్టల్ భవనాన్ని కోర్టు భవనంగా మార్చి నిర్మాణం పూర్తయిన కోర్టు భవన సముదాయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ ఈవి. వేణుగోపాల్ ప్రారంభించనున్నారు.