Miryalaguda : రేపు మిర్యాలగూడలో విద్యుత్ అంతరాయం.. విద్యుత్ తొలగించే వేళలు ఇవే..!

మిర్యాలగూడ పట్టణంలో రేపు శుక్రవారం విద్యుత్ కు అంతరాయం కలగనున్నట్లు విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. అందుకు వినియోగదారులు సహకరించాలని వారు కోరారు .

Miryalaguda : రేపు మిర్యాలగూడలో విద్యుత్ అంతరాయం.. విద్యుత్ తొలగించే వేళలు ఇవే..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలో రేపు శుక్రవారం విద్యుత్ కు అంతరాయం కలగనున్నట్లు విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. అందుకు వినియోగదారులు సహకరించాలని వారు కోరారు .

శుక్రవారం 22 న మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు టౌన్ 1 పరిధిలో గల మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీ సబ్ స్టేషన్ నుండి 11 కెవి ఇందిరమ్మ కాలనీ ఫీడరు , ఆర్ సి గూడెం సబ్ స్టేషన్ నుండి 11 కెవి ఆర్ సి గూడెం ఫీడర్లలో గల చెట్లు తొలగించుటకు ఎల్ సి తీసుకోబడును. దీనివల్ల ఇందిరమ్మ కాలనీ ఫీడర్ పరిధిలోగల ఇందిరమ్మ కాలనీ, విద్యానగర్ ప్రాంతం, ఆర్ సి గూడెం ఫీడర్ పరిధిలో గల రామచంద్ర గూడెం ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదని మిర్యాలగూడ టౌన్ వన్, ఎఈ. వెంకట్ రెడ్డి మిర్యాలగూడ టౌన్ టు, ఎఈ. వెంకటేశ్వర్లు తెలియజేశారు.

అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు టౌన్ టు పరిధిలో గల ఎఫ్ సి ఐ సబ్ స్టేషను నుండి ఎఫ్ సి ఐ మిర్యాలగూడ ఫీడర్ మరియు మిర్యాలగూడ టౌన్ సబ్ స్టేషన్ నుండి హౌసింగ్ బోర్డ్ ఫీడర్లలో గల చెట్లు తొలగించుటకు ఎల్ సి తీసుకోబడును.

దీనివల్ల ఎఫ్సీఐ ఫీడర్ పరిధిలో ప్రకాష్ నగర్, బాపూజీ నగర్ ప్రాంతాలకు హౌసింగ్ బోర్డ్ పీడరు పరిధిలో గల రెడ్డి కాలనీ, ముత్తిరెడ్డి కుంట, వినోబా నగర్ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

ALSO READ : 

Miryalaguda : రైతులను ఇబ్బంది పెడుతున్న ఆ రైస్ మిల్లు సీజ్ చేయండి.. కోమటిరెడ్డి ఆదేశం..!

BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

DSC : డీఎస్సీ అభ్యర్థులకు రెండు నెలల ఉచిత శిక్షణ, హాస్టల్ సౌకర్యం.. ధరఖాస్తు ఇలా చేయండి..!