Miryalaguda : రైతులను ఇబ్బంది పెడుతున్న ఆ రైస్ మిల్లు సీజ్ చేయండి.. కోమటిరెడ్డి ఆదేశం..!

ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడితే మిల్లులు సీజ్ చేస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు

Miryalaguda : రైతులను ఇబ్బంది పెడుతున్న ఆ రైస్ మిల్లు సీజ్ చేయండి.. కోమటిరెడ్డి ఆదేశం..!

మిర్యాలగూడ , మన సాక్షి :

ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడితే మిల్లులు సీజ్ చేస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లుల వద్ద రైతులతో మాట్లాడారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర తక్కువకు కొనుగోలు చేస్తూ రైతులను ఇబ్బందులు పెడుతున్న మహర్షి రైస్ మిల్లును సీజ్ చేయమని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా సమావేశం నిర్వహించుకుని రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ప్రభుత్వం చూస్తూ కూర్చోదు అన్నారు.

అదేవిధంగా ఇటీవల వడగండ్ల వర్షంతో నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం సహాయం అందించేందుకు చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉందన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాపాల వల్లనే ప్రస్తుతం కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు.

ALSO READ : BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!