BREAKING : ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు కూలీలు మృతి

ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు కూలీలు మృతి

గుంటూరు, మనసాక్షి :

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు కూలీలు మృతి చెందారు. ఈ విషాద సంఘటన పలువురిని కలచివేసింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు అక్కడి కక్కడే మృతి చెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.

 

20 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ లో మొత్తం 40 మంది కూలీలు ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం. ట్రాక్టర్ అతివేగంగా వెళ్లడం వలన అదుపుతప్పి బోల్తాపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే బోల్తా పడిందని స్థానికులు పేర్కొంటున్నారు మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది