Tragedy : తీవ్ర విషాదం.. హైదరాబాద్ లో రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!
హైదరాబాదులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Tragedy : తీవ్ర విషాదం.. హైదరాబాద్ లో రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!
హైదరాబాద్, మన సాక్షి,
హైదరాబాదులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చర్లపల్లి – ఘట్కేసర్ రైల్వే స్టేషన్ మధ్య శనివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయం రైల్వే ట్రాక్ పై మృతదేహాలను చూసి వాకీటాకీ ద్వారా గూడ్స్ రైలు లోకో పైలట్ సమాచారం ఇచ్చారు.
వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. మృతులు బోడుప్పల్ ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పిన్నింటి విజయశాంతి (38) విశాల్ రెడ్డి, చేతన రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు
విజయశాంతి తన కూతురు చేతన (ఇంటర్ సెకండియర్) చదువుతుండగా కొడుకు విశాల్ రెడ్డి ఇంటర్ (ఫస్టియర్) చదువుతుండగా వారితో కలిసి ఉంటున్నది. ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
విజయశాంతి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయిలో ఉంటున్నాడని, గత నాలుగు నెలలుగా ఇండియాకు రాలేదని తెలుస్తోంది. పిల్లలను కాలేజీ నుంచి శుక్రవారం సాయంత్రమే ఇంటికి తీసుకొచ్చినట్లు సమాచారం.
MOST READ
-
Miryalaguda : మిర్యాలగూడలో ఎవరికి వారే యమునా తీరు.. అంతా చైర్మన్ అభ్యర్థులే.. బి ఫాం కోసం ఇక యుద్ధమేనా..!
-
Nalgonda : ఆఖరి రోజు భారీగా నామినేషన్ల దాఖలు.. చివరి నిమిషంలో పార్టీ మారిన ఆశావాహులు..!
-
Suryapet : ఆరోగ్య ఉప కేంద్రానికి ఇంటి యజమాని తాళం.. రెండేళ్లుగా అద్దె చెల్లించని వైనం..!
-
Miryalaguda : చివరి నిమిషంలో షాక్.. మున్సిపల్ బరిలో ఎమ్మెల్యే బత్తుల కుటుంబ సభ్యులు..!









