క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District SP : బ్లూ కోట్స్ , కోర్టు డ్యూటీ విధులపై పోలీసు సిబ్బందికి శిక్షణ..!

District SP : బ్లూ కోట్స్ , కోర్టు డ్యూటీ విధులపై పోలీసు సిబ్బందికి శిక్షణ..!

సూర్యాపేట, మనసాక్షి:

పోలీసు పని విభగాలపై నిరంతర శిక్షణ సిబ్బంది పనిలో సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని జిల్లా ఎస్పీ కే నరసింహ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం లో పోలీస్ స్టేషన్ బ్లూ కోట్స్ సిబ్బందికి, కోర్ట్ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ఒకరోజు శిక్షణ నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై, సంఘటనలపై త్వరితగతిన స్పందించి బాధితులకు, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం ద్వారా పోలీస్ శాఖ పై మరింత నమ్మకం పెరుగుతుందని అన్నారు.

సిబ్బంది పారదర్శకంగా పనిచేస్తూ జవాబుదారితనంగా ఉండాలని, అధికారుల, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు. పోలీసు పని విభాగాల నిర్వహణ, పనిలో సామర్థ్యం పెంపొందించడంలో భాగంగా సిబ్బందికి నిరంతర శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఈశిక్షణను సద్వినియోగం చేసుకోవాలని విధుల నిర్వహణపై సలహాలు సూచనలు అందించారు. జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్స్ లో బ్లూ కోట్స్ సిబ్బంది, కోర్టు డ్యూటీ సిబ్బంది పని చేస్తున్నారని,. డయల్ 100 ద్వారా ఫిర్యాదులు అందిన వెంటనే సంఘటన స్థలానికి చేసురుకోవడానికి బ్లూ కోట్స్ సిబ్బందికి డయల్ 100 సమాచారాన్ని నేరుగా చేరవేయడం జరుగుతుంది.

వెంటనే సభందిత బ్లూ కోట్స్ సిబ్బంది త్వరిత గతిన సంఘటన స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకోవడం, అక్కడి పరిస్థితులను అధికారులకు చేరవేయడం చేయాలని అన్నారు. ఫిర్యాదుల నిర్వహణలో పారదర్శకంగా ఉండాలని, సమాచారాన్ని అనవసరంగా ఇతర వ్యక్తులకు ఇవ్వవద్దు అని ఆదేశించారు. కోర్టు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కోర్టు పెండింగ్ కేసుల్లో పోలీస్ అధికారులకు కోర్టులకు సమన్వయంగా ఉంటూ సమర్థవంతంగా పనిచేయాలని, ప్రతి కేసు వివరాలను కోర్ట్ డ్యూటీ క్యాలెండర్ నందు, అంతర్జాలం నందు నమోదు చేసుకోవాలని ఆదేశించారు.

పెండింగ్ కేసులు, ట్రయల్ కేసులు ఎప్పటికప్పటికీ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐలతో మాట్లాడాలని అన్నారు. సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు అధునాతన టెక్నాలజీ వాడుతున్నారు, ప్రతిఒక్కరు శిక్షణను సద్వినియోగం చేసుకోని టెక్నాలజీ అందిపుచుకోవాలని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమం లో సి సి ఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, బిసిఆర్బి ఇన్స్పెక్టర్ హరిబాబు, ఐటి కోడ్ ఆర్ ఎస్ ఐ రాజశేఖర్, టెక్నికల్ సిబ్బంది, బ్లూ కోట్స్, కోర్టు డ్యూటీ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ :

  1. ACB : సూర్యాపేట జిల్లాలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగి..!

  2. Indiramma Atmiya Bharosa : రైతు కూలీల ఖాతాలలో డబ్బులు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Bank Holidays : జూలైలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు.. లిస్ట్ ఇదే..!

  4. Hyderabad : హైదరాబాద్ లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..!

  5. Suryapet : సూర్యాపేట మున్సిపల్ కమీషనర్ ఎవరో తెలుసా..!

మరిన్ని వార్తలు