తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువైద్యంసూర్యాపేట జిల్లా

Suryapet : ఒకే కాన్పులో ముగ్గురి జననం.. తల్లి, పిల్లలు క్షేమం..!

Suryapet : ఒకే కాన్పులో ముగ్గురి జననం.. తల్లి, పిల్లలు క్షేమం..!

సూర్యాపేట, మన సాక్షి:

ఒకే కాన్పులో ఓ తల్లి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి, పిల్లలంతా క్షేమంగా ఉన్నారు. ఈ అరుదైన సంఘటన సూర్యాపేట జిల్లా లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..

సూర్యాపేట మునిసిపల్ పరిదిలోని రాయినిగూడెం గ్రామానికి చెందిన షేక్ షబానా 22 సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. నాటి నుంచి సంతానం కోసం అనేక హాస్పిటల్స్ తిరిగి అనేక ఇబ్బందులు పడ్డారు.. చివరగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీహాన్ హాస్పిటల్ లో సంతాన చికిత్స పొంది చివరకు గర్భం దాల్చారు.

ఆమెకు బిపి, షుగర్ థైరాయిడ్ తో భాధపడుతూ ఉండటం వలన శ్రీహన్ హాస్పిటల్ డాక్టర్. విజితగిరిధర్ రెడ్డి హైరిస్కు ప్రెగ్నెన్సీ గా అడ్మిట్ చేసుకొని సిజరిన్ చేయగా ఒకే కాన్పులో ముగ్గురు జన్మించడం జరిగింది.(ఇద్దరు మగ శిశువులు ఒక ఆడ శిశువు. 1.8 1.5 1.5) కేజీల బరువు ఉన్నట్లు చెప్పారు.

గతంలో కూడా ఎన్నో హైరిస్కు కేసులు చేసి అందరి మన్ననలు పొందారు. తల్లి బిడ్డలను సురక్షితంగా డిస్చార్జ్ చేయడం జరిగింది. ఈలాంటి కాన్పులు చాలా అరుదుగా జరుగుతుంది అని డాక్టర్.విజిత గిరిధర్ రెడ్డి చెప్పారు. తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్టు శ్రీహాన్ హాస్పిటల్ డైరెక్టర్. డాక్టర్ గిరిధర్ రెడ్డి తెలిపారు. వారి బంధు మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తూ డాక్టర్ విజితగిరిధర్ రెడ్డి కీ కృతజ్ఞతలు తెలిపారు.

MOST READ :

  1. Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలి.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశం..!

  2. District collector : భూ భారతిలో సమస్య పరిష్కారానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దరఖాస్తు.. జిల్లా కలెక్టర్..!

  3. TG News : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

  4. Walk in Interview : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ..!

  5. TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!

  6. TG News : ఇంటింటికి ఇంటర్నెట్.. 28 వేల పోస్టులకు నోటిఫికేషన్..!

మరిన్ని వార్తలు