నిరుద్యోగ సంఘర్షణ సభను జయప్రదం చేయాలి

పిసిసి సభ్యులు నేనావత్ బాలు నాయక్.

నిరుద్యోగ సంఘర్షణ సభను జయప్రదం చేయాలి

పిసిసి సభ్యులు నేనావత్ బాలు నాయక్.

చింతపల్లి. మన సాక్షి

హైదరాబాద్ లో సోమవారం జరిగే నిరుద్యోగ సంఘర్షణ ర్యాలీకి వేలాదిగా నిరుద్యోగ యువతీ యువకులు తరలిరావాలని దేవరకొండ పిసిసి సభ్యులు నేనా వత్ బాలు నాయక్ పేర్కొన్నారు. ఆదివారం చింతపల్లి మండల పరిధిలోని మాలవీటి నగర్ లో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్త సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.

 

ఈ సందర్భంగా మాట్లాడుతూకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కి నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేశారని వారు ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను యువత ఎక్కడ నిలదీస్తారనే ఉద్దేశంతో ఖాళీగా ఉన్న కొన్ని శాఖలలో మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించి పేపర్లు లు లీక్ చేయడం తో ఎంతో మంది నిరుద్యోగ యువతి యువకులు నేడు రోడ్డున పడ్డారని వారు ఆవేదన వ్యక్తపరిచారు.

 

నిరుద్యోగ యువతీ యువకుల పక్షాన పోరాడినందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అందులో భాగంగానే ఈనెల 8న సోమవారం  హైదరాబాదులోని సరూర్నగర్ స్టేడియంలో జరిగే నిరుద్యోగ సంఘర్షణ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వారి పేర్కొన్నారు. ఈ నిరుద్యోగ సంఘర్షణ ర్యాలీకి దేవరకొండ నియోజకవర్గం నుంచి సుమారు 5000 మంది నిరుద్యోగ యువతీ యువకు లు కార్యకర్తలను సభకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు.

 

త్వరలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానుందని. ఇటీవల నల్లగొండలో జరిగిన నిరుద్యోగ నిరసన దీక్షకు యువతీ యువకులు ఎలా వచ్చి సభను విజయవంతం చేశారో అదేవిధంగా హైదరాబాదులో జరిగే నిరసన ర్యాలీ దీక్షకు వేలాదిగా తరిగి రావాలని వారు యువతకు సూచించారు.

 

నీళ్లు నియామకాలు నిధుల పేరుతో ఆనాడు 12 వందల మంది విద్యార్థుల బలిదానాలకు మనస్థాపానికి గురై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారుల త్యాగధనుల విద్యార్థుల పోరాట ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయింది అన్నారు.

 

అలాంటి తెలంగాణ నేడు కుటుంబ కుటుంబ పాలనలోకి నియంత పాలనలోకి వెళ్ళింది అన్నారు. ఆ నియంత పాలన నుండి సంకెళ్లు తెంపుకొని అందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సంఘర్షణ ర్యాలీ మహాసభను హైదరాబాదులో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

 

రాబోవు ఎన్నికల్లో నియంత పాలనకు చరమగీతం పాడే అందుకే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ ఈ మహాసభ ఆగరు అవుతున్నారన్నారు. ఈ నిరుద్యోగ యువ సంఘర్షణ ర్యాలీ మహాసభకు దేవరకొండ నియోజకవర్గం నుండి వేలాది నిరుద్యోగ యువతీ యువకులు హాజరై సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంగిరేకుల నాగభూషణం. ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్. మాజీ సర్పంచ్ ఆంగిరేకుల గోవర్ధన్అంగరేకు ల జగదీష్ ఆంగిరేకుల సత్యనారాయణ.

 

గుండ్లపల్లి నర్సిరెడ్డి మాజీ జెడ్పిటిసి హరినాయక్ ఎండి ఇమ్రాన్. శ్రీనివాస్ కిషన్ నాయక్ మహేష్ గౌడ్. రాజు గౌడ్ కొప్పుల జంగయ్య గౌడ్ మునుకుంట్ల శేఖర్ గౌడ్ ఉప్పు శేఖర్ శ్రీశైలం మల్లేష్ యాదవ్ ముద్దం కృష్ణ గౌడ్ ఎండి ఖలీల్ శేఖర్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.