మిర్యాలగూడ : కంటి వెలుగు శిబిరం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మిర్యాలగూడ : కంటి వెలుగు శిబిరం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ పట్టణం 38 వ వార్డ్ చర్చి రోడ్ లో సెయింట్ మేరీ స్కూల్ లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంటి వెలుగు శిబిరం,పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు.

 

ఈ సందర్భంగా రోజు శిబిరంలో ఎంతమందికి కంటి పరీక్షలు చేస్తున్నారు, రీడింగ్ అద్దాలు, ప్రిస్క్రిప్షన్ అద్దాల పంపిణి పై ఆరా తీసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్హంగా ఆయన మాట్లాడుతూ అంధత్వ నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని వైద్యులకు సూచించారు.

మే 10 నుండి 19 వరకు నిర్వహించనున్న శిబిరం కు సరాసరి ప్రతి రోజు 142 మంది పరీక్షలకు వస్తున్నట్లు వైద్యాధికారి డా.లక్ష్మి ప్రసన్న వివరించారు. గామంలో 18 ఏళ్ళు పైబడిన వారందరు కంటి పరీక్షలు చేసుకునేలా ఏ.యన్.ఎం లు, ఆశా,అంగన్ వాడి వర్కర్లు అవగాహన కలిగించాలన్నారు.


అనంతరం పట్టణం లో మున్సిపాలిటీ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న నర్సరీని పరిశీలించారు. నర్సరీ ఫెన్సింగ్, గేట్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వివరించారు. చనిపోయిన మొక్కల స్థానం లో కొత్త మొక్కలు పెంచాలని, హరిత హరం లో నాటేందుకు నర్సరీ అభివృద్ధి పరచి మొక్కలు ఎండిపోకుండా నీరందించాలన్నారు.

కలెక్టర్ వెంట డిప్యూటీ డి.యం.హెచ్ ఓ డా. రవి, డా.లక్ష్మి ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.