పెన్ పహాడ్ : అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం

అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం

పెన్ పహాడ్, మన సాక్షి :

అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం రైతులను ఆదుకునే వారెవరు కాంటాల జాప్యం లారీలు రాక అన్నదాతల అయోమయం. పెన్ పహాడ్ మండలం అనంతారం పి ఎ సి యస్ పరిధిలోని నాగులపహాడ్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి దాన్యం రాశులు నీటమునిగినాయి.

 

వారం రోజులుగా దాన్యం కాంటాలు కాక కాంటావేసిన బస్తాలు ఎగుమతి కాక పూర్తిగా తడిసిపోయినాయి. సరి అయిన సమయానికి లారీలు పంపించకపోవడం తూకం వేయకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

అకాల వర్షానికి పూర్తిగా తడిసిన ధాన్యాన్ని కాంట వేసిన బస్తాలను మండల వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్ కి చూపించి రైతులు నిరసన తెలిపినారు. జిల్లా ఉన్నంత అధికారులు స్పందించి రైస్ మిల్లర్లతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

 

రైతులు సుంకరి జానకి రాములు, మండలి వెంకటయ్య, పర్సనబోయిన సాలయ్య, వెంకటేశ్వర్లు, మాధవరెడ్డి, వెంకన్న, రేఖ సత్యం, వడ్ల జానయ్య, పాల్గొన్నారు