మందమర్రి : బావిలో గుర్తు తెలియని మృతదేహం

మందమర్రి : బావిలో గుర్తు తెలియని మృతదేహం

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మందమర్రి పోలీసులు

మందమర్రి, మన సాక్షి.
మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటి పరిధిలోని శివపార్వతి ఫంక్షన్ హాల్ వెనుకాల కొద్ది దూరంలో అడిచెర్ల ఓదెలుకి చెందిన వ్యవసాయ బావిలో గుర్తు తెలియని మగ వ్యక్తి శవం కనిపించినదని ,

 

ఆ వ్యక్తి చనిపోయి దాదాపు వారం నుండి పది రోజులు అయి ఉండొచ్చు అని అడిచెర్ల ఓదెలు r/o నార్లపుర్ యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అట్టి ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా బావిలో పడి ఉన్న వ్యక్తి శవం కుళ్లిన స్థితిలో ఉండి గుర్తుపట్ట లేకుండా ఉన్నది అట్టి వ్యక్తికి వయస్సు దాదాపు 30 నుండి 40 సంవత్సరాలు ఉండి నీలం రంగు జీన్సు ప్యాంటు, వంకాయ రంగు గల షర్ట్ ధరించి ఉన్నది.

 

ఈ సందర్భంగా మందమర్రి ఎస్ఐ చంద్రకుమార్ మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా వ్యక్తులు తప్పిపోయిన,పైన తెలిపిన ఆధారాలకు తగ్గట్టుగా వ్యక్తుల సమాచారం ఉన్నట్లయితే మందమర్రి పోలీస్ వారిని సంప్రదించాలని కోరడం జరిగింది.