గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

చౌటుప్పల్. మన సాక్షి.

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం చౌటుప్పల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిఐ దేవేందర్ తెలిపిన వివరాలు ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ శివారు తుర్కగూడెం రోడ్డు వద్ద సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం పడి ఉండడంతో స్థానికులు గమనించి విషయాన్ని చౌటుప్పల్ పోలీసులకు చేరవేశారు.

 

ALSO READ : Rythu Bandhu : రైతు బంధు కోసం .. ఆ రైతులు ఇలా చేయాలి..!

 

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. మృతుడు యాచకుడై ఉంటాడని అనారోగ్య సమస్యల వల్ల కానీ ,ఎండ తీవ్రత భరించలేక కానీ చనిపోయి ఉండవచ్చునని సిఐ దేవేందర్ తెలిపారు.

 

మృతుడి వివరాలు తెలిసినవారు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించి వివరాలు తెలియజేయాలని కోరారు. ఈ మేరకు ఎస్సై ప్రభాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.