Breaking Newsతెలంగాణరాజకీయం

TG News : కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ పై అప్డేట్.. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

TG News : కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ పై అప్డేట్.. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల భేటీ పై జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎమ్మెల్యేల భేటీ వాస్తవమే అని ఆయన చెప్పారు. కానీ కాంగ్రెస్ పరిపాలన చాలా బాగుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుందన్నారు. ఎమ్మెల్యేలంతా భేటీ అయ్యి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టేందుకు నిధుల సమీకరణ కోసం సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు

ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షిని కూడా కలవనున్నట్లు ఆయన వెల్లడించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని, తన ఫైలు ఏదో ఉందని చెప్పడం సరికాదన్నారు. తాను ఎలాంటి ఫైలు ఆర్థిక మంత్రి వద్దకు తీసుకెళ్లలేదని ఏ ఫైలు ఉందో మల్లు రవి చెప్పాలన్నారు.

తాను మంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని చిల్లర విషయాల్లో తాను జోక్యం కల్పించుకోనన్నారు. ఎవరి రాజకీయ జీవితం ఏంటో అందరికి తెలుసు అన్నారు. అయితే తమ భేటీని ప్రతిపక్షాలు మరోరకంగా ప్రచారం చేస్తున్నాయని ఆయన వెల్లడించారు.

MOST READ : 

  1. సూర్యాపేట జిల్లాలో అఘోరి ప్రత్యక్షం.. యువకులతో ఘర్షణ, తల్వార్ తో దాడి..!

  2. TG News : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నిజమేనా.. సీఎంకు ఆ ఎమ్మెల్యే లేఖ..!

  3. Miryalaguda : అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం..!

  4. Miryalaguda : మిర్యాలగూడలో ప్రత్యేక నార్కోటిక్స్ డ్రగ్ స్నైపర్ డాగ్ తో తనిఖీలు..!

మరిన్ని వార్తలు