హైదరాబాద్ : వందే భారత్ వర్సెస్ ఎలక్ట్రిక్ గరుడ.. టు విజయవాడ..! ఏది బెటర్

హైదరాబాద్ : వందే భారత్ వర్సెస్ ఎలక్ట్రిక్ గరుడ.. టు విజయవాడ..!

హైదరాబాద్ , మనసాక్షి :

ఇండియన్ రైల్వేస్ తో తెలంగాణ ఆర్టీసీ పోటీ పడుతుంది. రైల్వే శాఖలో ప్రయాణికుల సౌకర్యార్థం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. కాగా తెలంగాణలో తెలుగు రాష్ట్రాలను కలుపుతూ హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం రూట్ వందే భారత్ ట్రైన్ ను మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ ప్రారంభించారు.

 

ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలతో పాటు సమయం ఆదా అయ్యే విధంగా ఈ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా దీనికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ కూడా లభిస్తుంది.

ఇదిలా ఉండగా తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ గరుడ బస్సులను అదే రూట్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎలక్ట్రిక్ గరుడ బస్సు కూడా వందే భారత్ తో పోటీ పడనున్నది.

 

ఎలక్ట్రిక్ గరుడ బస్సులో కూడా వందే భారత్ రైల్లో మాదిరిగానే ఏసీ తో పాటు సీటింగ్ అన్ని ప్రీమియం సౌకర్యాలను కల్పించారు. ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్ గరుడ బస్సులో కేవలం వాష్ ఏరియా మాత్రం ఉండదు. మిగతావన్నీ వందే భారత రైలులో ఉన్న సౌకర్యాలు ఉంటాయి.

అంతేకాకుండా సమయంలో కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు వందే భారత్ కు నాలుగు గంటల సమయం పడుతుండగా ఎలక్ట్రిక్ గరుడ బస్సులకు మరో గంట అదనంగా ఐదు గంటల సమయం పడుతుంది.

 

ఇంకా హైదరాబాద్ నుంచి బయలుదేరే ఎలక్ట్రిక్ గరుడ బస్సులకు కూడా వందే భారత్ రైలు స్టాపులు ఉన్నచోటనే స్టాపులు ఉన్నాయి. అంతే కాకుండా హైదరాబాద్ నుంచి విజయవాడకు వందే భారత్ లో 860 రూపాయలు ఉండగా, ఎలక్ట్రిక్ గరుడ బస్సులో 760 రూపాయలు మాత్రమే ఉంది.

 

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు … విజయవాడ మీదుగా వెళుతుంది. ఇది సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. ఒకే రైలు అందుబాటులో ఉంటుంది.

హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎలక్ట్రిక్ గరుడ బస్సులు మియాపూర్ నుంచి చాలా అందుబాటులో ఉన్నాయి. దీనికి ఐదు గంటల సమయం పడుతుంది.

 

ఈ రెండింటికి కూడా ఆన్ లైన్ బుక్ చేసుకుని అవకాశం ఉంది. ఇకపై ప్రయాణికులు ఎక్కువగా దేనిని ఆదరిస్తారో చూడాల్సి ఉంది.