Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
గుర్రంపోడు నూతన ఎస్ఐగా వెంకన్న గౌడ్ నియామకం..!
గుర్రంపోడు మండల కేంద్రానికి నూతన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)గా వెంకన్న గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

గుర్రంపోడు నూతన ఎస్ఐగా వెంకన్న గౌడ్ నియామకం..!
గుర్రంపోడు, మన సాక్షి:
గుర్రంపోడు మండల కేంద్రానికి నూతన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)గా వెంకన్న గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన పసుపులేటి మధు సెలవుపై వెళ్లడంతో, ఆయన స్థానంలో చండూరులో విధులు నిర్వహిస్తున్న వెంకన్న గౌడును ఇక్కడికి బదిలీ చేశారు.
గత కొద్దిరోజులుగా మధు సెలవులో ఉండటంతో, బి. రాజు ఇన్ఛార్జి ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా పూర్తిస్థాయి ఎస్ఐగా నియమితులైన వెంకన్న గౌడ్ త్వరలోనే పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని పేర్కొన్నారు.
By : Yaladri, 9949106045









