రాజేంద్ర ప్రసాద్ కు విదూషన్ పురస్కారం

ఠాగూర్ పాఠశాల అధినేత రాజేంద్ర ప్రసాద్ కు విదూషన్ పురస్కారం

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరుల చేతుల మీదుగా పురస్కార స్వీకరణ.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

విద్యా రంగంలో ఎనలేని కృషి చేస్తూ చదువుతో పాటు విద్యార్థులకు మంచి విద్యా బుద్దులు, విలువలు నేర్పుతూ సమాజంలో మేటిగా నిలిచిన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఠాగూర్ హైస్కూల్ అధినేత రాజేంద్రప్రసాద్ కు ఉత్తమ పురస్కారం లభించింది.

తెలంగాణ ఎంటర్ప్రీనర్స్ అసోసియేషన్ (టి) సంస్థ ఆధ్వర్యంలో విధుషన్ ఉత్తమ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.

అదేవిధంగా రాజేంద్రప్రసాద్ ప్రత్యేక శాలువా, జ్ఞాపికతో అభినందించారు. షాద్ నగర్ పట్టణంలో ఠాగూర్ విద్యాసంస్థలు ప్రారంభించి విద్యారంగంలో మంచి విలువలు కలిగిన విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఈ అవార్డు ఇచ్చినట్టు సంస్థ పేర్కొంది.