మిర్యాలగూడ :  మంచినీటి గోస

మిర్యాలగూడ :  మంచినీటి గోస

మిర్యాలగూడ, మనసాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో మంచినీటికి నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. వేసవిలో మంచినీళ్లు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

 

మిర్యాలగూడ పట్టణంలోని ఈదుల గూడా నాలుగో వార్డులో మంచినీళ్లు( సాగర్ నీళ్లు )రాక మూడు రోజులు అవుతుంది. దాంతో ఆ కాలనీవాసులు మంచినీటికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ కాలనీలో బోర్లు , నీటి వసతి కూడా లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా మంచినీరు వస్తుందని బిందెలు, బకెట్లు క్యూలో పెట్టి ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.


మంచినీరు రాక మూడు రోజులు అవుతుంది అని, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులు
పద్మ , జానమ్మ , పేర్ల వెంకటయ్య , గొడుగుల జానమ్మ, తిరుపతమ్మ శ్రావణి, మొయినమ్మ రంగయ్య పేర్కొన్నారు.