ప్లాస్టిక్ రహిత నియోజకవర్గం కావాలి.. ఆ తేదీ తర్వాత విక్రయిస్తే చర్యలు, డెడ్ లైన్ విధించిన ఎమ్మెల్యే..!
ప్లాస్టిక్ రహిత నియోజకవర్గం కావాలి.. ఆ తేదీ తర్వాత విక్రయిస్తే చర్యలు, డెడ్ లైన్ విధించిన ఎమ్మెల్యే..!
మిర్యాలగూడ , మన సాక్షి :
ప్లాస్టిక్ రహిత నియోజకవర్గం మిర్యాలగూడ నియోజకవర్గం కావాలని స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలోని ప్లాస్టిక్ విక్రయ దుకాణాలు, కూరగాయల మార్కెట్, తదితర వ్యాపార సంస్థలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్ధాలు వస్తున్నాయని, అందుకు ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని కోరారు. ప్లాస్టిక్ కవర్ల వ్యాపారులకు విక్రయాలు నిలిపివేయాలని ఆయన సూచించారు.
నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న మరో స్వచ్చంధ కార్యక్రమం అన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని, మరియు అమ్మకాలను పూర్తిగా తగ్గించాలని , 7వ తేది వరకు మార్కెట్ లో ప్లాస్టిక్ కవర్ అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత మీదే అన్నారు.
ఆగస్టు 15 వ తేది వరకు మిర్యాలగూడ నియోజకవర్గం పూర్తి ప్లాస్టిక్ కవర్ల రహితంగా మారాలని, దాని కోసం మాతో పాటు మీరు కూడా సహకరిస్తే అందరం కలసి మిర్యాలగూడ నియోజకవర్గం పర్యావరణ పరిరక్షణలో భాగం అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Good News : నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి శుభవార్త.. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ..!
Srishailam : శ్రీశైలంలో 859 అడుగులకు చేరిన నీటిమట్టం.. కొనసాగుతున్న వరద.. LATEST UPDATE










