Miryalaguda : ప్రజా ఉద్యమాలతో పాలకుల విధానాలను ఎండగడతాం.. తమ్మినేని హెచ్చరిక..!
Miryalaguda : ప్రజా ఉద్యమాలతో పాలకుల విధానాలను ఎండగడతాం.. తమ్మినేని హెచ్చరిక..!
గాదె శ్రీనివాస్ రెడ్డి విగ్రహావిష్కరణలో తమ్మినేని వీరభద్రం
మిర్యాలగూడ, మన సాక్షి:
పాలకుల విధానాలు చూసి ప్రజలు విసిగిపోయారని రాబోయే కాలమంతా ఎర్రజెండాదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం గాదే శ్రీనివాస్ రెడ్డి విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. ముందుగా ఈదులగూడెంలోని సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అక్కడే సిపిఎం జెండాను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఆవిష్కరించారు. అక్కడినుండి రాజీవ్ చౌక్ మీదుగా రామచంద్ర గూడంలోని గాదె శ్రీనివాసరెడ్డి స్తూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గాదె శ్రీనివాస్ రెడ్డి వగ్రహం ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మితో కలిసి ఆయన మాట్లాడారు. పేదల కోసం నిరంతరం పోరాడేది ఎర్రజెండా మాత్రమేనన్నారు. దోపిడి ఉన్నంతవరకు ఎర్రజెండా ఉంటుందని చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలు చేస్తామని తెలిపారు.
దేశంలో బిజెపి ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిన స్వభావం మాత్రం మార్చుకోలేదని విమర్శించారు. మైనార్టీలపై దాడులు చేస్తూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని విమర్శించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలు జరుగుతున్నాయని భవిష్యత్తులో శ్రామికరంగా ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ఇచ్చిందని ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం స్వేచ్ఛ కల్పిస్తూ నిర్బంధాలను రద్దు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు.
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో అఖిలపక్షాల అభిప్రాయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమాలకు గురికావాల్సి వస్తుందని చెప్పారు. ప్రజా సమస్యలను చర్చించి భవిష్యత్తు కార్యచరణ రూపొందించేందుకు ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, డబ్బికార్ మల్లేష్, నారీ ఐలయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి, పాలడుగు నాగార్జున, వీరేపల్లి వెంకటేశ్వర్లు, వన్ టౌన్, టూ టౌన్ కార్యదర్శిలు డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, భవాండ్ల పాండు, రవి నాయక్ శశిధర్ రెడ్డి, వరలక్ష్మి పరశురాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, గాదె శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు గాదె పద్మ, ప్రభాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తులకు ఇదే చివరి తేదీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Nalgonda : నల్గొండ బీఆర్ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు అనుమతి..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు మరో అవకాశం.. ఇవి తప్పనిసరి ఉండాలి.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం.. బిగ్ అప్డేట్..!
-
Banana : ఒక్క అరటిపండు రూ.100.. ఎక్కడో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..!










