ప్రజల పక్షాన నిలబడి పోరాడుతాం.. మాజీ మంత్రి హరీష్ రావు..!

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో హెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు.

ప్రజల పక్షాన నిలబడి పోరాడుతాం.. మాజీ మంత్రి హరీష్ రావు..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో హెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. కెసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారితో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు,మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకర్, ఫోన్ చేస్తే చాలు మీ సమస్య పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

ALSO READ : Record break : గత రికార్డు బ్రేక్ చేసిన రేవంత్ సర్కార్..!

అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఓడిపోతారని, గవర్నమెంట్ పడిపోతుందని ఎప్పుడూ కూడా కలలో ఊహించలేమని మంత్రి అన్నారు. కానీ రాజకీయాల్లో ఓటమి గెలుపు సహజం ఓటమి గెలుపుకు నాంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. వంద రోజుల్లో ఆరోగ్యానికి అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు చేయలేదు అన్నారు.

డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీపై తొలి సంతకం చేస్తామని చెప్పినా ముఖ్యమంత్రి ఆ మాట మార్చారన్నారు. ఇప్పటికే ప్రజలకు మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, బిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు, జడ్పిటిసిలు ఎంపిటిసిలు తాజా మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు ఉన్నారు.

ALSO READ : BREAKING : సూర్యాపేట జిల్లా మఠంపల్లి లో డ్రగ్స్ అధికారుల దాడులు.. మెడికల్ షాప్ నిర్వాహకుడి అరెస్టు..!