Record break : గత రికార్డు బ్రేక్ చేసిన రేవంత్ సర్కార్..!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే గత ప్రభుత్వాల రికార్డులను బ్రేక్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించింది.

Record break : గత రికార్డు బ్రేక్ చేసిన రేవంత్ సర్కార్..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే గత ప్రభుత్వాల రికార్డులను బ్రేక్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించింది. విద్యుత్ సరఫరా లో తెలంగాణ ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది కంటే ఎక్కువ సరఫరా చేసి రికార్డు సృష్టించింది. విద్యుత్ సరఫరా లో రికార్డు స్థాయిలో తెలంగాణ డిస్కములు కొత్త రికార్డు సృష్టించాయి.

రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కౌం ల పరిధిలో ఈనెల మార్చి 6వ తేదీన 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరిగింది. గత ఏడాది మార్చి 14వ తేదీన 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరిగింది. అది అప్పటి రికార్డు కాగా మార్చి 6 , 20 24 లో జరిగిన విద్యుత్ సరఫరా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రభుత్వ హయాంలో గత రికార్డులను చేరిపివేసింది. ఫిబ్రవరి, మార్చి మాసాలలో అత్యధిక డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ సంస్థలు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశాయి.

ALSO READ : BREAKING : సూర్యాపేట జిల్లా మఠంపల్లి లో డ్రగ్స్ అధికారుల దాడులు.. మెడికల్ షాప్ నిర్వాహకుడి అరెస్టు..!