Miyapur : మియాపూర్ లో అసలు ఏం జరుగుతోంది.. వందలాది మంది పోలీసులు ఎందుకు, వారంలో సీన్ రివర్స్..!

షేర్ లింగంపల్లి నియోజకవర్గం లోని మియాపూర్ లో భూ వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నించగా అడ్డుకొని పోలీసులు 144 సెక్షన్ విధించారు. అసలు మియాపూర్ వివాదం ఏంటి అనే విషయం తెలుసుకుందాం..

Miyapur : మియాపూర్ లో అసలు ఏం జరుగుతోంది.. వందలాది మంది పోలీసులు ఎందుకు, వారంలో సీన్ రివర్స్..!

శేరిలింగంపల్లి, మన సాక్షి :

శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ స్టాలిన్ నగర్ లో ఉన్నటువంటి సర్వే నంబర్ 100,101 లో ఉన్నటువంటి భూమి ప్రభుత్వ భూమి. అవును అది అక్షరాలా ప్రభుత్వ భూమే అని జగమెరిగిన సత్యం. అందులో కొంత భాగం ప్రైవేట్ వ్యక్తులు కొనగా వారికి ప్రభుత్వానికి మధ్య సుప్రీం కోర్టులో కేసులు ఇప్పటికి నడుస్తునే ఉన్నాయి. అత్యున్నతన్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో నేటికీ అవి అలానే ఉన్నాయి.

ప్రభుత్వం సుమారు 594 ఎకరాలు ఉన్న ఆ స్థలనికి రక్షణగా బాధ్యతను హెచ్ఎండీఏ కు అప్పగింగించి. కొన్నేళ్లుగా వారే ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా కాపలాగా ఉంటున్నారు. అయితే ఇటీవల స్థానికంగా ఉండే ఓ మహిళ నాయకురాలు ఆధ్వర్యంలో లోకల్ మహిళలతో కలిసి మీటింగ్ పెట్టి ప్రభుత్వ స్థలంలో కొన్ని గుడిసెలు వేసి ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తే కనీసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అయినా ఇవ్వకపోరా అని ప్రయత్నం చేశారు.

అందులో భాగంగానే కొన్ని రోజుల పాటు వారంతా స్టాలిన్ నగర్ ను ఆనుకోని ఉన్న స్టాలంలోకొంత మంది గుడిసెలు వేసే ప్రయత్నం వేశారు. అప్పుడు కేవలం వందల సంఖ్యలో మహిళలు ఉండడంతో హెచ్ఏండీ ఏ అధికారులు, స్థానిక పోలీసులు నచ్చ చెప్పడంతో పగలు అక్కడినించి వెళ్ళిపోయినా గూడు వస్తుందనే ఆశతో రాత్రి పూట అక్కడే ఉండసాగారు.

వారం తిరిగే లోపూ సీన్ రివర్స్ అయ్యింది : 

అప్పటివరకు స్థానికంగా ఉన్నవారే గుడిసెల ప్రయత్నం చేయగా అలా ఒక వారం గడిచిందో లేదో దావానలంలా ఇండ్ల స్థలాలు ఇస్తున్నారనే ప్రచారం జోరుగా జరగడంతో చిలికి చిలికి గాలివానలా వందల కిలోమీటర్ల వరకు వ్యాపించింది. దీంతో సుమారు వందల కిలోమీటర్ల నుంచి సొంత ఆటోలు వాహనాల్లో ఆశావాహులు ఇక్కడికి చేరుకోసాగారు.

దూరం నుంచి స్థానికేతరులకు కండ్ల ముందు వందల ఎకరాల స్థలం కనిపించడంతో వారికి ఎట్లగైనా సొంత గూడు ఏర్పరుచుకోవాలనే కోరిక మరింత బలమయ్యింది. అది ముమ్మాటికీ ప్రభుత్వ భూమి అని హెచ్ఎండీఏ అధికారులు నెత్తి నోరు కొట్టుకున్నా వారు అక్కడినించి వెళ్లేందుకు ససేమీరా అంటుండంతో అధికారులకు ఏమీ చేయాలో అర్ధం కావడం లేదు.

రెండు మూడు రోజుల్లోనే వందల నుంచి వేలల్లోకి చేరిన వైనం : 

గుడిసెలు వేసుకుంటే పోలీసులు, హెచ్ ఎండీ ఏ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఓ గుడిని కట్టే ప్రయత్నం కూడా చేయడం గమనార్హం. అయితే వాటిని అడ్డుకున్నారు. అయితే పరిస్థితి గురువారం వరకు అదుపులోనే ఉన్నది. అయితే శనివారం ఉన్నట్టుండి వేలాదిగా గుడిసెలు వేసేందుకు రావడంతో ఒక్కసారిగా ఆక్రమణ దారులకు, పోలిసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం చేసుకుంది. ఒకానొక సమయంలో పోలీసుల పైకి రాళ్ళు రువ్వడంతో పరుగులు పెట్టడం పోలీసుల వంతు అయ్యింది.

ఆదివారం ఉదయం మియాపూర్ చేరుకున్న సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పరిస్థితిని సమీక్షించారు. మియాపూర్ 100, 101 సర్వే నంకోర్టు ఉత్తర్వులు అములో ఉన్న ప్రభుత్వ భూమిలో ప్రాంతంలో ఎవరు ప్రవేశించినా అరెస్టులు ఉంటాయన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. చట్టాన్ని ఎవరు అతిక్రమించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ALSO READ : 

Ponguleti : రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లపై పొంగులేటి కీలక ప్రకటన..!

Free Coaching : సివిల్స్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ.. డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం..!

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!