TOP STORIESBreaking Newsజాతీయం

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. వారికి కూడా కాల్ చేయొచ్చు..!

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. వారికి కూడా కాల్ చేయొచ్చు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ మెసేజింగ్ యాప్ వినియోగదారులు కోట్లాది మంది ఉన్నారు. వాట్సప్ వినియోగదారుల భద్రత కోసం ఆ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతుంది. దాంతో పాటు మరింతగా వినియోగదారులకు సులభతరంగా చేసేందుకు గాను కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.

ఇప్పటికే వీడియో కాల్స్, వాయిస్ కాల్స్, మెసేజింగ్ లో నూతన ఫీచర్లను తీసుకొచ్చింది. ఇప్పుడు మరో అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి తెస్తుంది. అందులో భాగంగా iOS వినియోగదారుల కోసం కొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్ విడుదల చేయబడింది. అయితే ఈ ఫీచర్ వల్ల సులభతరంగా కాల్స్ చేసుకోవచ్చును.

ప్రస్తుతం వాట్సప్ కాల్ చేయడానికి ఫోన్ నెంబర్ కాంటాక్ట్ లో సేవ్ చేసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత వాట్సప్ వినియోగదారులు కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ వల్ల నెంబర్ సేవ్ చేసుకోకుండానే ఫోన్ కాల్స్ చేయవచ్చును. దీంతో వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అప్డేట్ ద్వారా ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు మరింత సులభంగా కాల్స్ చేసుకోవచ్చును.

ఇప్పుడు ఐఓఎస్ వినియోగదారులు కాల్స్ ట్యాబ్ లోని + గుర్తు పై నొక్కితే డయల్ నెంబర్ అని ఎంపిక కనిపిస్తుంది. ఈ ఎంపిక ద్వారా మీరు ఫోన్ నెంబర్ నమోదు చేసి కాల్ చేయవచ్చును. లేదా చాట్ కూడా చేయవచ్చును. అయితే ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ త్వరలో అన్ని వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది.

MOST READ : 

  1. Gold Price : రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ ధర.. ఒక్కరోజే రూ.11,500, ఈరోజు ధర ఎంతంటే..!

  2. Rythu Bharosa : రైతు భరోస పై కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Panchayat Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!

  4. Good News : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. రూ.5లక్షలు పొందే పథకం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

  5. District collector : ప్రజావాణి పెండింగ్ అర్జీలను వెంటనే పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

మరిన్ని వార్తలు