Rythu Bharosa : రైతు భరోసా మళ్లీ ఎప్పుడంటే.. డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా మళ్లీ ఎప్పుడంటే.. డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. జనవరి 26వ తేదీన రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు ఎకరానికి 12 వేల రూపాయల చొప్పున రెండు విడతలుగా అందజేసే ఈ పథకం మొదటి విడత 6000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
జనవరి 26వ తేదీన రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి ప్రారంభించగా వారికి 27వ తేదీన ఖాతాలలో డబ్బులు జమ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తుండగా మార్చి 31వ తేదీ వరకు అందరి రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 5వ తేదీన ఈ పథకం ద్వారా రైతులకు వారి వారి ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయి. ఈ పథకం ప్రారంభించిన రోజు 4.25 లక్షల మంది రైతుల ఖాతాలలో నిధులు జమ కాగా ఫిబ్రవరి 5వ తేదీన ఒక ఎకరం లోపు రైతులకు 17.03 లక్షల మంది రైతులకు నిధులు జమ అయ్యాయి. కాగా ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఈనెల 10న లేదా 11వ తేదీన నిధులు జమ కానున్నాయి. రెండు ఎకరాల లోపు రైతులకు మరోసారి నిధులు విడుదల చేయనున్నారు.
MOST READ :
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల పై స్పష్టం.. లేటెస్ట్ అప్డేట్..!
-
Tandel : తండెల్ ఎలా ఉందో తెలుసా..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!
-
Gold Price : రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్.. ఈరోజు ఎంతంటే..!
-
Penpahad : ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఉప వైద్యాధికారి.. రికార్డుల పరిశీలన..!
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడలేదా.. అయితే ఇలా చేయండి..!
- Rythu Bharosa : రైతు భరోసా.. 17.03 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.533 కోట్లు జమ.. చెక్ చేసుకోండి..!









