డబ్బుల కోసం భార్యని హత్య చేసిన భర్త

భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
రామకృష్ణాపూర్, మన సాక్షి
భార్యను గొడ్డలితో హత్య చేసి పరారీలో ఉన్న నిందితున్ని రామకృష్ణపూర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో గురువారం సిఐ మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి హత్య వివరాలు వెల్లడించారు.
రామకృష్ణపూర్ గంగకాలనిలో నిందితుడు లక్కాకుల లచ్చిరెడ్డి (70) భార్య మల్లమ్మ (65) కోడలు అన్నేడి మంజుల ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో నివాసం వుండేవారు. సింగరేణిలో విధులు నిర్వహించి పదవి విరమణ అనంతరం వచ్చిన డబ్బులను, స్వంత ఊరిలోని పొలం కౌలుకు ఇవ్వగా వచ్చిన డబ్బులు, పించన్ డబ్బులు మొత్తం భార్య మల్లమ్మ (65) దగ్గరే వుండేవని తెలిపారు.
నిందితునికి డబ్బులు అవసరమైనప్పుడల్లా
భార్యతో గొడవలు జరిగేవని అన్నారు. భార్యను హతమారిస్తే డబ్బులు మొత్తం తనకే చెందుతాయని భావించి 2023 జులై 7వ తేదీన రాత్రి 8 గంటల ప్రాంతంలో భార్యాభర్తలకు గొడవ జరిగింది.
అదే అదనుగా భావించి ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్య మెడపై దాడి చేసాడు. హత్యను చూసిన కోడలు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు.గాయపడిన మృతురాలి స్థానికుల సహకారంతో దగ్గరలో ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించగ, మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళమని వైద్యులు సూచించారు.
మంచిర్యాల ఆసుపత్రికి వైద్యులు పరీక్షించి మల్లమ్మ మరణించినట్లు నిర్దారించారు. కోడలు మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.
ఈ కేసుని ఏసిపి పి.సదయ్య అధ్వర్యంలో చెదించిన సిఐ జి.మహేందర్ రెడ్డి, రామకృష్ణపూర్ ఎస్ఐ, అశోక్, హెడ్ కానిస్టేబుల్ ఎం.దుర్గ ప్రసాద్, ఎన్.రాజమౌళి, కి.గిరిబాబు, పి.అజయ్ కుమార్, కానిస్టేబుళ్లు ఎన్.సంపత్, వి.అనిల్ కుమార్, టి.రవి, హోంగార్డ్ జి.రమేష్ లను డిసిపి సుదీర్ రామనాథ్ కేకన్ అభినందించారు.