World Health Day : వైద్య కళాశాలలో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు..!
World Health Day : వైద్య కళాశాలలో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ప్రతి గ్రామంలో వైద్య సేవలు అందాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం మండలంలోని అప్పక్ పల్లి వద్ద గల ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ తో పాటు కాళోజి యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య కళాశాల విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఒకే సంవత్సరంలో ఎంబీబీఎస్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీని ప్రారంభించుకున్నం అని అన్నారు. త్వరలో మదర్ ఆండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
కాళోజి యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ నందకుమార్ మాట్లాడుతూ నారాయణపేట మెడికల్ కాలేజీ పురోగతిలో ఉందని, కళాశాలకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని, లైబ్రరీకి అవసరమైన 4 వేల పుస్తకాలను పంపిస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త కే. పురుషోత్తం రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ దాసరి ప్రసాద్ రావు, డాక్టర్ విజయ్, సీనియర్ జర్నలిస్టు పంతంగి రాంబాబు, డిసిసి మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి , రెడ్ క్రాస్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, వైద్య నిపుణులు ఆదిత్య, చంద్ర మోహన్, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. తోటలో కల్తీ మద్యం తయారీ.. బ్రాండెడ్ పేరుతో విక్రయం..!
-
Job Mela : పోలీసు శాఖ జాబ్ మేళాకు విశేష స్పందన.. 3033 మంది ఉద్యోగాలకు ఎంపిక.. నియామక పత్రాల అందజేత..!
-
Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. తోటలో కల్తీ మద్యం తయారీ.. బ్రాండెడ్ పేరుతో విక్రయం..!
-
TG News : సన్న బియ్యం లబ్ధిదారుడి కుటుంబంతో మంత్రి ఉత్తమ్ భోజనం..!









