TOP STORIESతెలంగాణప్రపంచం

NagarjunaSagar : సాగర్ బుద్దవనంలో ప్రపంచ సుందరీలు..!

NagarjunaSagar : సాగర్ బుద్దవనంలో ప్రపంచ సుందరీలు..!

మిస్ వరల్డ్ 2025:
ఈ పోటీలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి, ఇందులో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుండి అందగత్తెలు పాల్గొంటున్నారు.

బుద్ధవనం:
ఇది నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్ లోని ఒక బౌద్ధ మతానికి సంబంధించిన థీమ్ పార్క్.

సందర్శన:
బుద్ధ జయంతిని పురస్కరించుకుని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు బుద్ధవనాన్ని సందర్శించారు.

కార్యక్రమాలు:
వారు బుద్ధవనంలోని మహాస్తూపం ధ్యాన మందిరానికి వెళ్లి, ధ్యానం చేశారు.

నాగార్జునసాగర్, మే 12, మన సాక్షి :

బుద్ధవనాన్ని మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొంటున్న అందగత్తెలు సందర్శించారు. ఈ అందగత్తెలు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లోని బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించారు.

ఈ సందర్శన బుద్ధ జయంతి రోజు జరిగింది. బుద్ధ జయంతిని పురస్కరించుకుని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు బుద్ధవనాన్ని సందర్శించారు, వారు అక్కడ జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన అందాల పోటీకి వివిధ దేశాల నుంచి విచ్చేసిన భామ‌లు సోమవారం నాగార్జునసాగర్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు.

వీరు హైదరాబాద్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా బొంగ్లూరు ఎగ్జిట్‌ నెంబ 12వద్ద దిగారు. అక్కడి నుంచి బొంగ్లూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్‌, చింతపల్లి, వెల్లంకి అతిథిగృహం నుంచి మల్లెపల్లి, అంగడిపేట, పెద్దపురం మీదుగా నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు నాగార్జుసాగర్‌కు బయలుదేరారు. అక్కడ విజయ విహార్‌కు వెళ్లారు.

ఈ టూర్‌లో భాగంగా బౌద్ధ వనం గురించి, మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనడానికి ప్రపంచ దేశాల సుందరీమణులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. తెలంగాణకు స్పెషల్ టూరిజం స్పాట్స్‌ను కలియ తిరుగుతున్నారు. తెలంగాణ సాంప్రదాయం గురించి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం వారు సాగార్జున సాగర్‌ను సందర్శించారు.

ఈ కేంద్రం ప్రత్యేకతలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు శివనాగిరెడ్డి వివరించారు. జాతక వనంలో బుద్ధ జీవన క్రమాన్ని తెలిపే శిల్పాలను వారు సందర్శించారు. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును మిస్‌వరల్డ్‌ పోటీలకు హాజరైన సుందరీమణులు సందర్శిస్తున్నారు.

బుద్ధ జయంతి రోజున ఈ సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమనేది విశేషం. వీరు సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడ పర్యటిస్తున్నారు. విదేశాల్లోని బౌద్ధ పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా అధికారులు బుద్ధవనాన్ని ఎంపిక చేశారు.

నాగార్జున సాగర్ లోని బుద్ధ వనంలో మిస్ వరల్డ్ కాంటెస్టెంటకు జానపద, గిరిజన నృత్య కళాకారులతో గణ స్వాగతం పలికారు. నాగార్జున సాగర్ వాటర్ బ్యాక్ గ్రౌండ్లో స్పెషల్ ఫోటో షూట్లో కూడా పాల్గొననున్నారు. నాగార్జున సాగర్లో సుమారు నాలుగు గంటల పాటు పర్యటించనున్నారు.

విందు అనంతరం హైదరాబాద్కు బయలుదేరనున్నారు. మిస్‌ వరల్డ్‌-2025 పోటీల్లో పాల్గొంటున్న ఆసియా ఓసియాన గ్రూప్ 4 లోని 22 దేశాల సుందరీమణులు ఈ రోజు బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు.

ఇండియా, బంగ్లాదేశ్, కాంబోడియా మయన్మార్, వియత్నం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ,ఇండోనేసియా, జపాన్ , కజకిస్తాన్, కిర్గికిస్తాన్, లెబనాన్, మంగోలియా, నేపాల్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, శ్రీలంక, టర్కీ, చైనా, థాయిలాండ్, ఆర్మేనియా దేశాల కాంటెస్టర్లు ఈ టూర్‌లో పాల్గొన్నారు.

మిస్‌వరల్డ్‌ పోటీదారులు బౌద్ధ థీమ్‌పార్క్‌లోని స్తూపంలో బుద్ధుని విగ్రహాల చెంత జరిగిన ధ్యానం,ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు పర్యాటక సంస్థ విజయ్‌విహార్‌లో కొంతసేపు విశ్రాంతి అనంతరం ఫోటో షూట్ లో పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nelakondapalli : చారిత్ర ఆధారాలకు నెలవు.. మరో ప్రాచీన ఆనవాళ్లు వెలుగులోకి..!

  2. Mental Health : మానసిక ఆరోగ్యం కోసం ఇలా చేయండి..!

  3. Steet Food: రుచిగా ఉన్నాయని రోడ్డు పక్కన ఫుడ్ లాగిస్తున్నారా.. అయితే మీకు ఆ రోగాలు గ్యారంటీ..!

  4. ReSL: నెట్ జీరో లక్ష్యానికి ఊతం.. రీ సస్టైనబిలిటీ ఐఎస్‌ఎస్‌తో సరికొత్త శకం..!

మరిన్ని వార్తలు